E-Paper
Advertisement

Rahul Gandhi : మధ్యప్రదేశ్ లో ఉత్సాహంగా భారత్ జోడో యాత్ర..సైకిల్ తొక్కిన రాహుల్

Rahul Gandhi : మధ్యప్రదేశ్ లో ఉత్సాహంగా భారత్ జోడో యాత్ర..సైకిల్ తొక్కిన రాహుల్
Advertisement

Rahul Gandhi : కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో ఉత్సాహంగా సాగుతోంది. ఇండోర్ నగరంలో సైకిలు తొక్కి రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు చుట్టుముట్టి పూలవర్షం కురిపించారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో బైక్ నడిపారు రాహుల్ గాంధీ .

82వ రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇండోర్‌లోని బడా గణపతి చౌరహా నుంచి తిరిగి ప్రారంభమైంది. అన్ని వర్గాల ప్రజలను పలకరిస్తూ రాహుల్‌ ఉత్సాహంగా పాదయాత్ర చేస్తున్నారు. సోమవారం బారోలి గ్రామం, కృష్ణా ఎన్‌క్లేవ్‌, తరణ గ్రామాల మీదుగా పాదయాత్ర సాగనుంది. రాత్రికి సన్‌విర్‌ వద్ద రాహుల్‌ బస చేయనున్నారు.

Advertisement

రాహుల్ గాంధీ పాదయాత్ర కన్యాకుమారిలో ప్రారంభమైనప్పటి నుంచి ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. చిన్నారులు, యువతతో కలిసి ఆడటం, గిరిజనులతో కలిసి నృత్యం చేయడం, స్థానికులతో సరదాగా గడపడం ఇలా సాగుతోంది భారత్ జోడో యాత్ర. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర సాగనుంది. ఈ యాత్రలో ఇప్పటివరకు ఏడు రాష్ట్రాలు, 34 జిల్లాలను చుట్టేశారు రాహుల్ గాంధీ. ఇప్పటి వరకు 1,307 కిలోమీటర్ల దూరం నడిచారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్న సంకల్పంతో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×