E-Paper
Advertisement

Pune: దారుణం.. మహిళకు ఎముకలు తినిపించారు!

Pune: దారుణం.. మహిళకు ఎముకలు తినిపించారు!
Advertisement

Pune: టెక్నాలజీ దినదినా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొందరు మూఢనమ్మకాలను మాత్రం వీడడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మూఢనమ్మకాల పేరుతో దారుణాలకు పాల్పడుతున్నారు. కొందరు తాంత్రికుల తప్పుడు మాటలు నమ్మి నరబలి, జంతుబలులు ఇస్తున్నారు. తాజాగా పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళ చేత స్మశానంలో ఎముకలు తినిపించారు. ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

పుణెకు చెందిన ఓ మహిళకు పెళ్లై ఐదు సంవత్సాలు గడిచినా సంతానం కలగ లేదు. దీంతో ఆమె భర్తతో పాటు, కుటుంబ సభ్యులు శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. నిత్యం సూటిపోటి మాటలతో వేధించారు. పలుమార్లు తాంత్రికుడితో క్షుద్ర పూజలు కూడా నిర్వహించారు. ఇటీవల నరబలి, జంతుబలి ఇచ్చే ఓ మాంత్రికుడితో అర్థరాత్రి స్మశానంలో తాంత్రిక పూజలు చేయించారు. బాధిత మహిళను బలవంతంగా పూజలో కూర్చోబెట్టి ఆమె చేత మనుషుల అస్థికలను తినిపించారు.

Advertisement

భర్త, కుటుంబ సభ్యుల ఆగడాలతో విసిగి పోయిన బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు భర్త, కుటుంబ సభ్యులు, తాంత్రికుడితో సహా వారికి సహకరించిన మొత్తం 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×