E-Paper
Advertisement

Priyanka Gandhi : నడ్డా స్థానంలో ప్రియాంక..? ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభకు..

Priyanka Gandhi : కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ రాజ్యసభకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభ పదవీకాలం త్వరలో ముగియనుంది. దాంతో ఖాళీ కానున్న ఆ స్థానం నుంచి సోనియా గాంధీ లేక ప్రియాంకా గాంధీని ఎగువ సభకు పంపాలని భావిస్తున్నట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్ ప్రతిభాసింగ్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

సోనియా లేదా ప్రియాంకతో చర్చిస్తామని ప్రతిభాసింగ్ వెల్లడించారు. వారు ఆసక్తి చూపిస్తే.. ఇద్దరిలో ఒకరు ఆ స్థానంలో రాజ్యసభకు వెళ్తారని తెలిపారు. ప్రస్తుతం సోనియా.. రాయబరేలీ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. ప్రియాంక మాత్రం ఇంతవరకు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించలేదు.

Advertisement

2018లో హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉండటంతో.. ఆ రాష్ట్రం నుంచి జేపీ నడ్డా రాజ్యసభకు వెళ్లారు. ఆయన పదవీకాలం ఏప్రిల్ నెలతో పూర్తికానుంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ లో 68 స్థానాలకు గానూ 40 సీట్లను దక్కించుకొని విజయం సాధించింది. దాంతో ఇప్పుడు ఆ స్థానం కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లనుంది. మరోపక్క, 56 ఎగువసభ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నామని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దాని ప్రకారం.. హిమాచల్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే ప్రతిభాసింగ్ వ్యాఖ్యలు వచ్చాయి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×