E-Paper
Advertisement

Himachal pradesh : హిమాచల్ ప్రదేశ్ లో కొనసాగుతున్న పోలింగ్..సెంటిమెంట్ పనిచేస్తుందా?

Himachal pradesh : హిమాచల్ ప్రదేశ్ లో కొనసాగుతున్న పోలింగ్..సెంటిమెంట్ పనిచేస్తుందా?
Advertisement

Himachal pradesh : హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. మొత్తం 68 నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 412 మంది అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. రాష్ట్రంలో 55, 92, 828 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల విధుల్లో 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చి హిమాచల్ ప్రదేశ్ లో కొత్త చరిత్ర సృష్టించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అధికార పక్షాన్ని ఓడించి విపక్ష పార్టీకి పట్టం కట్టే సంప్రదాయం ఈ రాష్ట్రంలో ఉంది. అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని కాంగ్రెస్ నమ్ముతోంది. మరోవైపు ఆమ్‌ఆద్మీ పార్టీ హిమాచల్ ప్రదేశ్ లో బరిలో ఉంది. ఆప్ ను ఏ మేరకు ప్రజలు ఆదరిస్తారో చూడాలి మరి.

Advertisement

హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు ఉత్సాహంగా ఓటేసి సరికొత్త చరిత్ర సృష్టించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రజలకు రాష్ట్ర పరిస్థితిపై అవగాహన ఉందని అందుకు తగ్గట్టుగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×