E-Paper
Advertisement

Petrol Diesel : ధరలూ భారీగానే.. అమ్మకాలూ భారీగానే…

Petrol Diesel : ధరలూ భారీగానే.. అమ్మకాలూ భారీగానే…
Advertisement

Petrol Diesel : ధరలు ఎక్కువగా ఉన్నా… దేశంలో ఇంధన అమ్మకాలు ఏ మాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు 2022 డిసెంబర్‌లో భారీగా పెరిగాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనుల కారణంగా పెట్రోల్, డీజిల్ విక్రయాలు ఎక్కువగా జరిగినట్లు చెబుతున్నారు. 2022 డిసెంబర్లో పెట్రోల్‌ విక్రయాలు 2.76 మిలియన్‌ టన్నులుగా నమోదవగా… డీజిల్ అమ్మకాలు 7.3 మిలియన్‌ టన్నులుగా నమోదైంది.

కరోనాకు ముందు.. అంటే 2019 డిసెంబరుతో పోల్చి చూస్తే 2022 డిసెంబర్లో 23 శాతం ఎక్కువగా పెట్రోల్ అమ్ముడైంది. ఇది 2021 డిసెంబర్‌ నెలతో పోల్చి చూస్తే 8.6 శాతం, 2020 డిసెంబరుతో పోల్చి చూస్తే 13 శాతం ఎక్కువ. అదే 2022 నవంబర్‌ నెల విక్రయాలతో పోల్చి చూసినా 4 శాతం ఎక్కువే. డీజిల్‌ అమ్మకాలు కూడా 2021 డిసెంబర్ నెలతో పోలిస్తే 2022 డిసెంబర్‌లో 13 శాతం అధికం. ఇది 2020 డిసెంబర్‌ నెలతో పోలిస్తే 15 శాతం, 2019 డిసెంబర్‌ నెలతో పోలిస్తే 11 శాతం ఎక్కు. అదే 2022 నవంబర్‌ నెల విక్రయాలతో పోల్చినప్పుడు… డిసెంబర్లో డీజిల్ అమ్మకాలు 0.5 శాతం తగ్గాయి.

Advertisement

వ్యవసాయ రంగంలో పనులు పెరిగినందువల్లే ఇంధన విక్రయాలు పెరిగాయని చెబుతున్నారు. సాధారణంగా ట్రాక్టర్లు, ఇరిగేషన్‌ పంప్‌ల కోసం డీజిల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. 2022 జూన్‌ నుంచి చూస్తే… జూలై, ఆగస్ట్‌లో అధిక వర్షాలతో పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్‌ తగ్గింది. మిగిలిన నెలల్లో మాత్రం ఇంధన విక్రయాలు జోరుగా సాగాయి. విమాన ప్రయాణికుల రద్దీ కూడా గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఏవియేషన్‌ టర్బయిన్‌ ఫ్యూయల్‌-ఏటీఎఫ్‌ విక్రయాలు డిసెంబర్లో 18 శాతం వృద్ధి చెంది 6,06,000 టన్నులుగా నమోదైంది. 2020 డిసెంబర్‌తో పోల్చి చూస్తే ఇది 50 శాతం అధికం. ఇక వంటగ్యాస్‌ విక్రయాలు 8 శాతం వృద్ధితో 2.72 మిలియన్‌ టన్నులుగా నమోదైంది. నెలవారీగా చూస్తే ఈ వృద్ధి 6 శాతానికి పైనే ఉంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×