E-Paper
Advertisement

Diwali Bonus : ఉద్యోగులకు సర్‌ప్రైజ్.. బోనస్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్..

Diwali Bonus : ఉద్యోగులకు సర్‌ప్రైజ్.. బోనస్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్..
Advertisement

Diwali Bonus : తమిళనాడులోని నీలగిరి జిల్లా కోటగిరి పట్టణంలో ఉన్న ఒక టీ ఎస్టేట్ యజమాని పి శివకుమార్ తన ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా రూ.2 లక్షలకు పైగా విలువైన బైక్‌లను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. టీ ఎస్టేట్‌లో గత రెండు దశాబ్దాలుగా 627 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. శివకుమార్.. తన మేనేజర్, సూపర్‌వైజర్, స్టోర్ కీపర్, క్యాషియర్, ఫీల్డ్ స్టాఫ్, డ్రైవర్‌లతో సహా 15 మంది ఉద్యోగులకు బైక్‌లను బహుమతిగా ఇచ్చాడు.

కొత్త బైక్‌ల తాళాలు ఉద్యోగులకు అందజేసి వారితో కలిసి శివకుమార్ రైడ్‌కి కూడా వెళ్లాడు. ఎస్టేట్‌ యజమాని తమకు 15 రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను బహుమతిగా ఇచ్చాడని ఓ ఉద్యోగి తెలిపాడు. తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చేర్పించాలని కోరుకునే కార్మికుల కోసం ఎస్టేట్ సమీపంలోని నేడుగుల పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను ఎస్టేట్ యాజమాన్యం నియమించింది. గతంలో మూతపడే దశలో ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం 320 మంది విద్యార్థులు ఉండగా, అందులో 80 మంది ఎస్టేట్‌కు చెందిన వారే కావడం గమనార్హం. అంతేకాకుండా, శివకుమార్ కార్మికులకు ఉచితంగా మందులు అందజేసే ఫార్మసీని కూడా నడుపుతున్నాడు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×