E-Paper
Advertisement

Yamuna : యమునా నది ఉగ్రరూపం.. మళ్లీ ఢిల్లీకి వరద ముప్పు..

Yamuna : యమునా నది ఉగ్రరూపం.. మళ్లీ ఢిల్లీకి వరద ముప్పు..
Advertisement

Yamuna : ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుమునా నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఢిల్లీలో ప్రమాదకరస్థాయి 205.33 మీటర్లను దాటింది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వానల వల్ల హత్నికుండ్ బ్యారేజ్‌ నుంచి యుమునా నదిలోకి నీటిని విడుదల చేశారు. దీంతో నీటిమట్టం పెరిగింది. దీంతో ఢిల్లీకి మరోసారి వరదముప్పు పొంచి ఉంది.

హత్నికుండ్‌ బ్యారేజ్‌ నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ మంత్రి అతిషీ ప్రకటించారు.

Advertisement

గత వారం యమునా నది నీటి మట్టం 208.05 మీటర్లకు చేరింది. ఆ తర్వాత యుమునా నది శాంతించింది. దీంతో నీటి మట్టం 205.02 మీటర్లకు తగ్గింది. తాజాగా హత్నికుండ్‌ బ్యారేజ్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో మళ్లీ నీటిమట్టం పెరిగి 206.07 మీటర్లకు చేరుకుంది.

జులై 25 వరకు ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా సహా యమునా ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల వరదలు పోటెత్తుతున్నాయి. వరదల కారణంగా 27 వేల మంది తమ ఇళ్లను ఖాళీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×