// // NIA Court : దేశంలో భారీ పేలుళ్లకు కుట్ర.. దోషులకు 10 ఏళ్ల జైలుశిక్ష.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

NIA Court : దేశంలో భారీ పేలుళ్లకు కుట్ర.. దోషులకు 10 ఏళ్ల జైలుశిక్ష..

NIA Court : దేశంలో భారీ పేలుళ్లకు కుట్ర.. దోషులకు 10 ఏళ్ల జైలుశిక్ష..
Advertisement

NIA news today(Current news from India): హైదరాబాద్, ఢిల్లీల్లో భారీ పేలుళ్లకు రెక్కీ నిర్వహించిన దోషులకు 10 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ NIA ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసులో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు ఢిల్లీ NIA కోర్టు జైలు శిక్ష వేసింది. హైదరాబాద్‌కు చెందిన ఒబేద్ రహమాన్, బీహార్‌కు చెందిన ధనిష్ అన్సారీ, ఆఫ్తాబ్ ఆలం, మహారాష్ట్రకు చెందిన ఇమ్రాన్ ఖాన్‌లను 2013లో NIA అరెస్ట్ చేసింది.

హైదరాబాద్, ఢిల్లీలోని పలు చోట్ల పేలుళ్లకు పాల్పడేందుకు దోషులు రెక్కీ నిర్వహించారని నిర్ధారించారు. ఇందుకోసం ఆయుధాలను సమకూర్చుకున్నట్లు సాక్ష్యాలను సేకరించింది. దీనిపై విచారణ జరిపిన NIA ప్రత్యేక కోర్టు నలుగురిని దోషులుగా తేల్చింది. 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

Advertisement

ఇండియన్ ముజాహుద్దీన్ తీవ్రవాదులతో కలిసి దోషులు దేశంలో పలు చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నారు. గతంలో వారణాసి, ముంబై, ఫజియాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూర్‌లలో జరిగిన పేలుళ్లలోనూ నలుగురు నిందితుల పాత్ర ఉందని దర్యాప్తు అధికారులు తేల్చారు. 2007లో గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ జంట పేలుళ్లు, 2013లో దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లలో నిందితుల పాత్ర ఉందని నిర్ధరించారు. మొత్తం 11మందిని నిందితులుగా జాతీయ దర్యాప్తు సంస్థ NIA చేర్చింది.

నలుగురికి 10 ఏళ్ల శిక్ష పడగా.. మిగతా ఏడుగురు నిందితుల్లో యాసిన్ బత్కల్, అక్తర్, రెహమాన్, తెహసిన్ అక్తర్, హైదర్ అలీ, రియాజ్ బత్కల్‌తో పాటు మరో నిందితుడు ఉన్నాడు. జైల్లో ఉన్న ఐదుగురు నిందితులపై విచారణ కొనసాగుతోంది. శిక్ష పడిన వారిలో దోషి డానిష్ అన్సారీకి 2వేలు, అఫ్తాబ్ ఆలంకు 10 వేల జరిమానా కూడా విధించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×