// // Parliament : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు .. ఆ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Parliament : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు .. ఆ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం..

Parliament : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు .. ఆ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం..
Advertisement

Parliament : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలషెడ్యూల్ ఖరారైంది. జూలై 20 నుంచి ఆగస్టు 11 వరకు సమావేశాలు నిర్వహిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రకటించారు. ఈసారి సమావేశాలు తొలుత పార్లమెంట్ పాత భవనంలో మొదలవుతాయని ఇటీవల అధికార వర్గాలు ప్రకటించాయి.ఆ తర్వాత కొత్త భవనంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపాయి. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మే 28న పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్రం భావిస్తోంది. ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ విషయంలో ఇప్పటికే చాలా మంది పార్లమెంట్ సభ్యుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. ఈ బిల్లును కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. మరికొన్ని పార్టీలు మద్దతు ఇచ్చే అవకాసం ఉంది. ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై బిల్లును ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. ఈ ఆర్డినెన్స్‌పై కేంద్రం, ఆప్‌ ప్రభుత్వం మధ్య వార్ నడుస్తోంది. ఆప్‌ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

Advertisement

వచ్చే ఏడాది ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇవే చివరి వర్షాకాల సమావేశాలు కావడం ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా విపక్షాలు కలిసికట్టుగా పోరాడేందుకు సిద్ధమయ్యాయి. వివిధ అంశాల్లో కేంద్రాన్ని ప్రశ్నించేందుకు సన్నద్ధమవుతున్నాయి. మణిపుర్ ఘర్షణలపై చర్చకు విపక్షాలు పట్టబట్టే అవకాశం ఉంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×