E-Paper
Advertisement

Rahul Gandhi : సోనియా చెవిలో ఆ మహిళ చెప్పిన మాటేంటి..? బయట పెట్టిన రాహుల్..

Rahul Gandhi : సోనియా చెవిలో ఆ మహిళ చెప్పిన మాటేంటి..? బయట పెట్టిన రాహుల్..
Advertisement
Rahul Gandhi

Rahul Gandhi : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పెళ్లి ప్రస్తావన మరోసారి చర్చకు వచ్చింది. ఇటీవల సోనియా కుటుంబాన్ని కలిసేందుకు హర్యానా రైతులు వచ్చారు. ఈ సందర్భంగా సోనియాతో మాట్లాడుతూ.. రాహుల్‌ పెళ్లి గురించి అడిగారు. జులైలో ఆ రాష్ట్రంలో పర్యటించిన రాహుల్‌ గాంధీ.. సోనీపట్ జిల్లా మదీనా గ్రామ మహిళా రైతులను కలిశారు. ఆ సమయంలో తమకు ఢిల్లీకి రావాలని ఉందని రాహుల్‌కు చెప్పడంతో.. వారిని ఆహ్వానించారు . ఆ మహిళలంతా ఢిల్లీలో సోనియా నివాసానికి వెళ్లారు. హర్యానా నుంచి వెళ్లిన మహిళా రైతులు ముందుగా ఢిల్లీలోని పలు ప్రాంతాలు సందర్శించారు. అనంతరం 10
జన్‌పథ్‌లోని సోనియాగాంధీ నివాసానికి చేరుకున్నారు.

Advertisement

సోనియా నివాసానికి చేరుకున్న హర్యానా మహిళా రైతులను సాదరంగా ఆహ్వానించారు రాహుల్‌ కుటుంబ సభ్యులు. వారికి ప్రత్యేక ఆతిథ్యం ఏర్పాటు చేయడమే కాకుండా.. సోనియాతోపాటు ప్రియాంక, రాహుల్‌ కూడా వారితో కలిసి భోజనం చేశారు. ఆప్యాయంగా ముచ్చటించారు.ఈ సందర్భంగా ఓ మహిళ చిన్నగా.. సోనియా గాంధీ చెవిలో ఓ మాట అడిగింది. రాహుల్‌కు పెళ్లి చేద్దామా అని అంది. అందుకు సోనియా బదులిస్తూ.. మీరే ఓ మంచి అమ్మాయిని చూడండి అనడంతో.. రాహుల్‌ నవ్వుతూ..అవుతుంది.. అవుతుందిలే అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశారు రాహుల్‌ గాంధీ.

రాజీవ్‌ గాంధీ మరణం గురించి మహిళా రైతులు.. సోనియాను అడగ్గా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయంపై ప్రియాంక బదులిస్తూ.. ఆ సమయంలో అమ్మ చాలా కుంగుబాటుకు లోనయ్యారని.. కొన్ని రోజులపాటు ఆహారం, నీళ్లు ముట్టలేదని చెబుతుండగా.. సోనియా కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం తేరుకుని మహిళలతో సరదాగా ముచ్చటించారు. మహిళా రైతులతో కలిసి నృత్యం చేశారు సోనియా, ప్రియాంక.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×