E-Paper
Advertisement

Doctor: ఆసుపత్రి ముందే పానీపూరీ బండి పెట్టుకున్న లేడీ డాక్టర్.. ఎందుకంటే..

Doctor: ఆసుపత్రి ముందే పానీపూరీ బండి పెట్టుకున్న లేడీ డాక్టర్.. ఎందుకంటే..
Advertisement

Doctor: పానీపూరీ అంటే ఇష్టపడని వారుంటారా.. వందలో ఒకరో ఇద్దరో. అది తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా చాలా మంది ఇష్టంగా ఆరగించేస్తుంటారు. ఇక డాక్టర్లు కూడా పానీపూరీని తినొద్దని హెచ్చరిస్తుంటారు. కానీ ఈ డాక్టర్ అందరు డాక్టర్లలా కాదు.. తానే స్వయంగా ఆసుపత్రి ముందు పానీపూరీ బండి పెట్టి అమ్ముతుంది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.

అయితే ఆ డాక్టర్ అలా చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఇటీవల రాజస్థాన్‌లో అశోక్ గహ్లోత్ ప్రభుత్వం కొత్త ఆరోగ్య బిల్లును తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులకు నష్టం వాటిల్లుతోంది. దీంతో అక్కడి వైద్యులంతా నిరసనలు తెలుపుతున్నారు. ఈక్రమంలోనే డాక్టర్ అనిత తన ఆసుపత్రికి తాళం వేసి.. పానీపూరి బండి పెట్టుకొని నిరసన తెలిపింది.

Advertisement

ఆసుపత్రి బోర్డు కూడా తీసేసి అనిత.. పుచ్కావాలీ అని పానీపూరీ షాపు బోర్డుపెట్టింది. అలాగే తన నేమ్ బోర్డ్‌ను కూడా మాజీ ప్రైవేట్ డాక్టర్ అని ఛేంచ్ చేసింది. ప్రస్తుతం ఆ డాక్టర్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

కాగా ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం పేదలకు మేలు జరిగే విధంగా కొత్త ఆరోగ్య బిల్లును తీసుకొచ్చింది. అదే రైట్ టు హెల్త్. దీని ద్వారా రాష్ట్రంలోని ప్రజలందరూ ఏ ఆసుపత్రిలోనైనా ఫ్రీగా ట్రీట్‌మెంట్ పొందవచ్చు. ఇందుకు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది.

Advertisement

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×