E-Paper
Advertisement

Supremecourt : సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఆ ఇద్దరికీ ఛాన్స్ .. కొలీజియం సిఫార్సు..

Supremecourt : సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఆ ఇద్దరికీ ఛాన్స్ .. కొలీజియం సిఫార్సు..
Advertisement

Supreme court collegium news today(Telugu news updates): తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వెంకటనారాయణ భట్‌ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన కొలీజియం ఈ సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండాలి. కానీ ప్రస్తుతం 31 మందే ఉన్నారు. 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అందువల్ల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నారు.

2011 అక్టోబర్‌ 17న గోహతి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ బాధ్యతలు చేపట్టారు. ఆయన 2022 జూన్‌ 28 నుంచి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ భూయాన్‌ విభిన్న అంశాలపై అనుభవం సంపాదించారు. ఆయనకు ట్యాక్సేషన్‌ లాలో ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఆయన తీర్పుల్లో చట్టం, న్యాయానికి సంబంధించి విస్తృత కోణాలను స్పృశించారు.

Advertisement

2013 ఏప్రిల్‌ 12న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ వెంకటనారాయణ భట్‌ బాధ్యతలు చేపట్టారు. 2019లో మార్చిలో జస్టిస్‌ భట్‌ కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2023 జూన్‌ 1 నుంచి కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయనకు న్యాయరంగానికి సంబంధించిన వివిధ శాఖల్లో అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలిజీయం సిఫార్సు చేసింది. సీనియారిటీలో జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తర్వాత జస్టిస్‌ ఎస్‌.వెంకటనారాయణ భట్‌ పేరును ప్రతిపాదించింది.

జస్టిస్‌ వెంకటనారాయణ భట్‌ నియామకం పూర్తయితే సుప్రీంకోర్టులో సేవలందించే 3వ తెలుగు న్యాయమూర్తి అవుతారు. ప్రస్తుతం ఇద్దరు తెలుగువారు జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా ఉన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×