E-Paper
Advertisement

Chandrayaan 3 Updates : ఇదిగిదిగో చంద్రుడి వీడియో.. ఫూటేజ్ అదుర్స్..

Chandrayaan 3  Updates : ఇదిగిదిగో చంద్రుడి వీడియో.. ఫూటేజ్ అదుర్స్..
Advertisement
Chandrayaan 3

Chandrayaan 3 Updates(Latest Updates from ISRO) : జాబిల్లికి మరింత దగ్గరైంది చంద్రయాన్‌-3 ల్యాండర్. ఇప్పటికే ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యుల్ విక్రమ్ ను వేరు చేయగా.. తాజాగా విక్రమ్‌ ల్యాండర్ కక్ష్యను విజయవంతంగా తగ్గించారు. ఇంధనాన్ని మండించి చంద్రుడికి మరింత దగ్గరగా ఉన్న కక్ష్యలో ల్యాండర్‌ను పంపారు. మొదటి డీబూస్టింగ్ విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. తర్వాత డీబూస్టింగ్‌ను ఈ నెల 20న తెల్లవారుజామున రెండు గంటలకు నిర్వహిస్తామని ఇస్రో ప్రకటించింది.

Advertisement

ఇదే సమయంలో జాబిల్లికి సంబంధించిన లెటెస్ట్‌ వీడియోను ఇస్రోకు పంపింది విక్రమ్‌. ల్యాండర్ పోసిషన్ డిటెక్షన్ కెమెరాతో చంద్రుడి వీడియోను తీయగా.. దానిని ఇస్రో కమాండ్ సెంటర్‌కు పంపింది విక్రమ్‌. ఈ వీడియోను ఇస్రో రిలీజ్‌ చేసింది. ఇండిపెండెన్స్‌ డే రోజు ఈ వీడియోను రికార్డ్ చేసింది చంద్రయాన్‌-3.

ప్రస్తుతం విక్రమ్ ల్యాండర్‌ను డీబూస్ట్ చేసే పనిలో ఉన్నారు ఇస్రో సైంటిస్టులు. 30 కిలోమీటర్ల పెరిలూన్.. 100 కిలో మీటర్ల అపోలూన్ ఉన్న కక్ష్యలో దాని స్థానం కోసం డీబూస్ట్ అంటే ల్యాండర్‌ ను స్లో చేయడం మొదలుపెట్టారు. ఈ ల్యాండర్ ఆగస్టు 23 సాయంత్రం చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వస్తుంది. చంద్రుడిపే పరిశోధనలు చేస్తోంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే చంద్రుడి పైకి ల్యాండర్, రోవర్ పంపిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టిస్తుంది. ఇప్పటికే సోవియట్ యూనియన్, అమెరికా, చైనా చంద్రుడి పైకి రోవర్లను పంపాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×