E-Paper
Advertisement

Indian internet economy : 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకోనున్న ఇండియన్ ఇంటర్నెట్ ఎకానమీ..

Indian internet economy : 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకోనున్న ఇండియన్ ఇంటర్నెట్ ఎకానమీ..
Advertisement
Indian internet economy

Indian internet economy : స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్.. ఇలాంటివి లేకుండా జీవితమే ముందుకు వెళ్లదేమో అన్న పరిస్థితి వచ్చేసింది. ముఖ్యంగా ఇంటర్నెట్ లేకపోతే అసలు స్మార్ట్ ఫోన్ ఎందుకు అనుకునే రేంజ్‌కు యూజర్లు వచ్చేశారు. అయితే ఈ ఇంటర్నెట్ అనేది కూడా ఎకానమీపై ప్రభావం చూపిస్తుందని టెక్ నిపుణులు చెప్తున్నారు. దీనిలో కూడా లాభ, నష్టాలు ఉంటాయని అంటున్నారు. ఇప్పుడు ఉన్నదానితో పోలిస్తే మరో ఏడేళ్లలో ఇండియా ఇంటర్నెట్ ఎకానమీలో ఊహించని మార్పులు వస్తాయని వారు బయటపెట్టారు.

Advertisement

2022లో ఇండియా ఇంటర్నెట్ ఎకానమీ అనేది 175 బిలియన్ డాలర్లుగా ఉంది. కానీ మరో ఏడేళ్లలో.. అంటే 2030 వచ్చేవరకు ఎకానమీ అనేది 1 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియాలోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం ఏ విధంగా ఉంది, మొత్తంగా డిజిటలైజేషన్ అనేది ఎలా ముందుకు వెళ్తోంది, స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది.. ఇలాంటివన్నీ ఇండియా ఇంటర్నెట్ ఎకానమీని లెక్కజేసే విషయంలో కీలకంగా నిలుస్తాయని వారు అంటున్నారు.

2030 లోపు ఇండియన్ టెక్నాలజీ రంగం అనేది 48 శాతం నుండి 62 శాతం మెరుగుపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు జీడీపీ అనేది 4 నుండి 5 శాతం పెరుగుతుండగా ఇది 12 నుండి 13 శాతం వరకు పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇండియా అనేది ఇంటర్నెట్ ఎకానమీ విషయంలో చాలా బలపడుతుందని, వచ్చే దశాబ్దం వరకు ఇది మరింత బలపడుతుందని భావిస్తున్నారు. ఈ కామర్స్ లాంటి రంగాలు 40 శాతం అభివృద్ధిని చూస్తాయని అంటున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ అనేది ట్రెండ్ అవుతుండడంలో ఈ కామర్స్‌కు మంచి క్రేజ్ లభిస్తుందని అన్నారు.

Advertisement

ఇప్పుడు ఉన్న ఆన్‌లైన్ షాపర్స్‌తో పోలిస్తే.. 2030 వరకు వీరి సంఖ్య డబుల్ అవుతుందని, దీంతో ఈ కామర్స్ రంగం మరింత ముందుకు వెళుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ కామర్స్‌తో పాటు ఆన్‌లైన్ పేమెంట్స్, పెట్టుబడులు లాంటివి కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఇంటర్నెట్ ఇన్‌కమ్ అనేది పెరుగుతూ వస్తోంది. మరో పదేళ్లలో ఈ రంగాలన్నీ మరింత పెరుగుతాయని వారు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారి హౌజ్‌హోల్డ్ ఇన్‌కమ్స్ కూడా పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×