E-Paper
Advertisement

INDIA Alliance meet Murmu: మణిపూర్‌పై జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతికి ఇండియా విజ్ఞప్తి..

INDIA Alliance meet Murmu: మణిపూర్‌పై జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతికి ఇండియా విజ్ఞప్తి..
Advertisement
INDIA Alliance on Manipur violence

INDIA Alliance on Manipur violence(Today news paper telugu): రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఇండియా కూటమి ఎంపీలు భేటీ అయ్యారు. రాష్ట్రపతి విపక్ష ఎంపీలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. మ‌ణిపూర్ హింసాకాండ‌పై విప‌క్షాల ఆవేద‌న‌ను వినాలని.. మణిపూర్‌ అంశంపై జోక్యం చేసుకోవాలని విపక్ష ఎంపీలు విజ్ఞప్తి చేశారు. విపక్ష బృందానికి రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సారథ్యం వహించారు.

ఇండియా కూటమిలోని 21 మంది ఎంపీలు రెండురోజులపాటు మణిపూర్‌లో పర్యటించారు. అక్కడి బాధితులను కలిశారు. మణిపూర్‌ గవర్నర్‌ అనుసూయా ఉయికీని కలిసి శాంతి భద్రతలను తిరిగి నెలకొనేలా చూడాలంటూ మెమొరాండం సమర్పించారు. ఇప్పుడు కూడా అదే తీరులో రాష్ట్రపతికి కూడా మెమోరాండమ్ సమర్పించారు విపక్ష ఎంపీలు.

Advertisement

మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితిని రాష్ట్రపతికి వివరించామన్నారు మల్లికార్జున ఖర్గే. తాజా పరిస్థితులను వివరిస్తూ మెమోరాండమ్ ఇచ్చామని.. దానిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. తమ విజ్ఞప్తిపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారన్నారు.

ఇక పార్లమెంట్‌లో కేంద్రం విపక్షాల గొంతు నొక్కుతుందని ఆరోపించారు ఖర్గే. తాము మాట్లాడుతుంటే మైక్‌లను మ్యూట్ చేస్తున్నారని ఆరోపించారు. మణిపూర్‌ అంశంపై ఇప్పటికైనా ప్రధాని నరేంద్రమోడీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×