E-Paper
Advertisement

Manipur : మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. నలుగురు మిస్సింగ్

Manipur : మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. నలుగురు మిస్సింగ్
Advertisement

Manipur : మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో కాల్పులు ఘటన తాజాగా మరోసారి జరిగింది. బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి, తౌబల్ జిల్లాలోని వాంగూ మధ్య కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిగిన ప్రాంతానికి దగ్గరల్లో అల్లం కోయడానికి వెళ్లిన నలుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు.

గల్లంతైన నలుగురిని ఓయినమ్ రోమెన్ మైతేయి (45), అహంతేమ్ దారా మైతేయి (56), తౌడం ఇబోమ్చా మైతేయి (53), తౌడం ఆనంద్ మైతేయి (27)గా పోలీసులు గుర్తించారు. ఘటన తర్వాత కుంబి పోలీస్ స్టేషన్‌లో ఆ నలుగురిపై మిస్సింగ్ కేసు నమోదైంది. చిన్న తుపాకుల నుంచి కాల్పులు జరగడానికి ముందుగా ఆరు రౌండ్ల మోర్టార్ కాల్పులు జరిగాయని స్థానిక నివేదికలు తెలిపాయి.

Advertisement

అంతకుముందు జనవరి 1న, తౌబల్స్ లిలాంగ్ ప్రాంతంలో గుర్తుతెలియని సాయుధ దుండగులు, స్థానికుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో నలుగురు మృతిచెందారు. మరుసటి రోజే గస్తీలో ఉన్న సాయుధ బలగాలపై దుండగులు కాల్పులు చేశారు. మణిపూర్‌లో గత ఏడాది మేలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగింది. అ‍ప్పటి నుంచి హింసాత్మక సంఘటనలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 180 మంది ప్రాణాలను కోల్పోయారు.

ఎస్టీ హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండుకు నిరసనగా రష్ర్టంలోని కొండ జిల్లాలో ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించడంతో ఘర్షణలు చెలరేగాయని సమాచారం. రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ నుంచి కుకి గ్రామస్తులను తొలగించడంపై ఉద్రిక్తతతో హింస ముందు జరగడంతో చిన్న ఆందోళనలకు దారితీసింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×