E-Paper
Advertisement

Hand transplant : హరియాణాలో అరుదైన ఘనత.. శస్త్రచికిత్స చేసి చేతులను అమర్చిన వైద్యులు..

Hand transplant : హరియాణాలో అరుదైన ఘనత..  శస్త్రచికిత్స చేసి చేతులను అమర్చిన వైద్యులు..
Advertisement

Hand transplant : చేతులు కోల్పోయిన ఇద్దరు వ్యక్తులకు అరుదైన శస్త్రచికిత్సలు చేసి వారి జీవితాల్లో వైద్యులు ఆశలను నింపారు. ఈ అరుదైన ఘనత హరియాణా లోని ‘అమృత ఆసుపత్రి’ వైద్య బృందం సాధించింది. ఇద్దరు వ్యక్తులకు ఉత్తర భారత్‌లో తొలిసారి శస్త్రచికిత్స చేసి చేతులను అమర్చిన ఆసుపత్రిగా నిలిచింది.

ఢిల్లీకి చెందిన గౌతమ్ తయల్‌ (64) అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం ప్రమాదంలో ఎడమ చేతిని కోల్పోయాడు. పదేళ్ల కిందట అతనికి కిడ్నీ మార్పిడి కూడా జరిగింది. బ్రెయిన్‌ డెడ్‌తో మరణించిన 40 ఏళ్ల వ్యక్తి చేతిని వైద్యులు గౌతమ్‌కు అమర్చారు. ప్రస్తుతం అతను విజయవంతంగా వేళ్లను కదిలించగలుగుతున్నాడని వైద్యులు తెలిపారు. త్వరలో డిశ్చార్జ్‌ చేస్తామని చేప్పారు. దేశంలో కిడ్నీ, చేతిని మార్పించుకొన్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ప్రపంచంలో ఈ తరహా శస్త్రచికిత్సలు చేయించుకొన్న రెండో వ్యక్తి గౌతమ్ కావడం విశేషం.

Advertisement

మూడేళ్ల క్రితం రైలు ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయిన దేవాన్ష్‌ గుప్తా (19) అనే వ్యక్తికి కూడా ఈ ఆసుపత్రి వైద్య బృందం చేతులను అమర్చింది. బ్రెయిన్‌ డెడ్‌తో మరణించిన 33 ఏళ్ల వ్యక్తి చేతులను సేకరించారు. గతేడాది డిసెంబరులో నిర్వహించిన ఈ రెండు శస్త్రచికిత్సలను 17 గంటల్లో పూర్తి చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×