E-Paper
Advertisement

College: లవర్స్ డేలోపు బాయ్‌ఫ్రెండ్ ఉండాల్సిందే..

College: లవర్స్ డేలోపు బాయ్‌ఫ్రెండ్ ఉండాల్సిందే..
Advertisement

College: ప్రేమ అనేది ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా కాలేజీ రోజుల్లో ఎక్కువ మంది ప్రేమలో పడుతుంటారు. కాలేజీకి వెళ్లడం మానేసి సినిమాలకు, పార్క్‌లకు వెళ్లే వారు చాలా మంది ఉంటారు. అయితే ఇటువంటి సంఘటనలు జరగకుండా కాలేజీ యాజమాన్యాలు చర్యలు తీసుకుంటుంటాయి. ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు వస్తుండడంతో ఓ కాలేజీ తరుపు రిలీజ్ అయిన నోటీసు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

‘‘కళాశాలలో చదవుతున్న ప్రతి ఒక్క అమ్మాయి ప్రేమికుల దినోత్సవం రోజుకల్లా బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించాలి. లేదంటే కాలేజీలోకి అనుమతించబోము’’ అంటూ ఒడిశాలోని ఎస్‌వీఎం కాలేజీ పేరిట ఈ నోటీసు రిలీజ్ అయింది. ఆ నోటీస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కాలేజీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లల తల్లిదండ్రులు కాలేజీపై మండిపడుతున్నారు.

Advertisement

ఈ వ్యవహారంపై కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ స్పందించారు. ఈ నోటీస్‌కి కాలేజీకి ఎటువంటి సంబంధం లేదని, అది ఫేక్ నోటీసని స్పష్టం చేశారు. తన సంతకాన్ని దుర్వినియోగం చేసి, కాలేజీ పరువు తీయడానికి కావాలనే ఫేక్ నోటీసు సృష్టించారని తెలిపారు. విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ నోటీస్ సృష్టించిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×