E-Paper
Advertisement

Delhi Liquor Scam : లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు.. ఆప్ నేత ఇంట్లో సోదాలు

Delhi Liquor Scam : లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు.. ఆప్ నేత ఇంట్లో సోదాలు
Advertisement

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మళ్లీ దూకుడు పెంచింది. బుధవారం ఉదయం నుంచి మరో ఆప్ కీలక నేత ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పలువురు అప్రూవర్ లుగా మారిన నేపథ్యంలో.. ఈ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు చెందిన నార్త్ అవెన్యూ నివాసంలో బుధవారం ఉదయం ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లిక్కర్ స్కాం తో సంబంధమున్న వ్యాపారవేత్త దినేశ్ అరోరాతో సంజయ్ కు పరిచయం ఉన్నట్లు ఈడీ గుర్తించింది.

దినేష్ ను సంజయ్ సింగ్ దగ్గర ఉండి మాజీ మంత్రి మనీశ్ సిసోడియాకు పరిచయం చేసినట్లు ఈడీ తన అభియోగాల్లో పేర్కొంది. అంతేకాకుండా లిక్కర్ డిపార్ట్ మెంట్ తో దినేష్ అరోరాకు ఉన్న దీర్ఘకాలిక సమస్యను ఎంపీ సంజయ్ సింగ్ పరిష్కరించారని కూడా ఈడీ ఆరోపించింది. కానీ.. ఈ స్కామ్ లో సంజయ్ సింగ్ పేరును ఈడీ నిందితుల జాబితాలో చేర్చలేదు. ఛార్జిషీట్ లో అతని పేరున్నప్పటికీ..ఇంతవరకూ సమన్లు జారీ చేయలేదు. మనీశ్ సిసోడియా అరెస్ట్ తర్వాత.. ఈడీ సంజయ్ సింగ్ పై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఆయన ఇంట్లో సోదాలు పూర్తయ్యాక అక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈడీ తదుపరి చర్యలు తీసుకోనుంది.

Advertisement

ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంటిపై ఈడీ దాడులు చేయడాన్ని ఆప్ నేతలు ఖండించారు. అదానీ గ్రూపు గురించి ప్రశ్నించినందుకే సంజయ్ సింగ్ ఇంటిపై ఈడీ సోదాలు చేస్తోందని ఆప్ స్పోక్స్ పర్సన్ రీనా గుప్తా ఆరోపించారు. చైనా నుంచి న్యూస్ క్లిక్ సంస్థకు ఫండింగ్ వచ్చిందంటూ నిన్న జర్నలిస్టులపై, నేడు ఆప్ నేత ఇంటిలో సోదాలు చేయడాన్ని ఆమె ఖండించారు. మరో ఆప్ నేత మల్వీందర్ సింగ్ కూడా ఈ సోదాలపై స్పందించారు. బీజేపీ ఆప్ నేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఉదయం నుంచి సంజయ్ ఇంటిలో సోదాలు చేస్తున్న ఈడీ అధికారులకు ఇంతవరకూ ఒక్కరూపాయి కూడా అవినీతి సొమ్ముగా లభించలేదన్నారు. ఇదంతా కేవలం పొలిటికల్ రివేంజ్ అని మల్వీందర్ అభిప్రాయపడ్డారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×