E-Paper
Advertisement

Helicopter: ధ్రువ్ హెలికాప్లర్లు నిలిపివేత.. జవాన్ అనిల్‌ మరణంతో ఆర్మీ దిద్దుబాటు చర్య..

Helicopter: ధ్రువ్ హెలికాప్లర్లు నిలిపివేత.. జవాన్ అనిల్‌ మరణంతో ఆర్మీ దిద్దుబాటు చర్య..
Advertisement

Helicopter: భారత సైన్యానికి చెందిన తేలికపాటి హెలికాప్టర్‌ ధ్రువ్‌ రెండు రోజుల క్రితం జమ్మూకశ్మీర్‌లో కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ సాంకేతిక నిపుణుడు దుర్మరణం చెందాడు. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఆర్మీ.. ధ్రువ్‌ హెలికాప్టర్ల వినియోగాన్ని మరోసారి నిలిపివేసింది. ఈ మేరకు మిలిటరీ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఈ చాపర్ల వినియోగాన్ని నిలిపివేయడం రెండు నెలల్లో ఇది రెండోసారి.

ఈ ఏడాది మార్చి 8న మన నౌకాదళానికి చెందిన ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ .. ముంబయి తీరంలో ప్రమాదానికి గురైంది. అందులోని ముగ్గురు సిబ్బందిని నేవీ పెట్రోలింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్ సాయంతో రక్షించారు. ఈ ఘటన తర్వాత ధ్రువ్‌ హెలికాప్టర్ల వినియోగాన్ని త్రివిధ దళాల్లో నిలిపివేశారు. అయితే గత సోమవారం నుంచే సైన్యం వీటి సేవలను పునరుద్ధరించగా.. గురువారం ఓ ధ్రువ్‌ హెలికాప్టర్‌ కూలిపోయింది.

Advertisement

సాంకేతిక లోపం తలెత్తడంతో జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా దించేందుకు ప్రయత్నిస్తుండగా ఈ చాపర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన సాంకేతిక నిపుణుడు పబ్బల్ల అనిల్‌ మృతి చెందగా, ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఆర్మీ.. ముందు జాగ్రత్త చర్యగా ధ్రువ్‌ చాపర్ల వినియోగాన్ని నిలిపివేసినట్లు మిలిటరీ వర్గాలు తెలిపాయి. నేవీ, కోస్ట్‌గార్డ్‌లోని ధ్రువ్‌ హెలికాప్టర్లకు సాంకేతిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు, జమ్మూ కశ్మీర్‌లో హెలికాప్టర్‌ కూలిన ఘటనలో మరణించిన తెలంగాణకు చెందిన జవాన్‌ పబ్బాల అనిల్‌ అంత్యక్రియలు ముగిశాయి. స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కాపుర్ లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, శ్రేయోభిలాషులు అనిల్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. జై జవాన్ నినాదాలతో మల్కాపూర్ మార్మోగిపోయింది. అనిల్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అమర జవాన్ అనిల్ పార్థివదేహానికి మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ నివాళులర్పించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×