E-Paper
Advertisement

Sabarimala: అయ్యప్పలతో కిక్కిరిసిన శబరిమల.. ఎరుమేలిలో భారీగా ట్రాఫిక్

Sabarimala: అయ్యప్పలతో కిక్కిరిసిన శబరిమల.. ఎరుమేలిలో భారీగా ట్రాఫిక్
Advertisement

Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులతో కిక్కిరిపోతోంది. స్వాముల రద్దీతో ఇసుక వేస్తే రాలని పరిస్థితి నెలకొంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో భక్తుల రద్దీతో శబరిమల కిటకిటలాడుతోంది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.

శబరిమలలో భక్తుల రద్దీతో ఎరుమేలిలో దాదాపు 4 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో కాలినడక వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇక అంతకంతకు భక్తుల రద్దీ పెరుగుతుండటంతో కొందరు స్వాములు అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుతిరుగుతున్నారు. మరోవైపు భక్తుల రద్దీతో కేరళ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. శబరిమల సన్నిథానానికి వెళ్లే అటవీ మార్గం సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటలకు పెంచింది. రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమలకు తరలిరావడంతో తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్‌ తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో.. భక్తులు ఇబ్బందులకు గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×