E-Paper
Advertisement

No Confidence Motion update: మణిపూర్ ఇష్యూ.. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ..

No Confidence Motion update: మణిపూర్ ఇష్యూ.. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ..
Advertisement
No Confidence Motion in parliament

No Confidence Motion in parliament(Latest political news in India):

కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలైంది. దీనిపై మూడు రోజులపాటు చర్చ జరుగుతుంది. చివరిరోజు ప్రధాని మోదీ మాట్లాడతారు.

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో జాతుల మధ్య వైరం నేపథ్యంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. హింసాకాండ జరుగుతోంది. రెండువర్గాలు దాడులు చేసుకుంటున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు మణిపూర్ అంశంపై ఉభయ సభల్లో రగడ జరిగింది. మణిపూర్ పై మోదీ మాట్లాడాలని చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని పార్లమెంట్‌కు రావాలని కోరుతున్నాయి.

Advertisement

మణిపూర్ ఇష్యూపై మోదీ మాట్లాడకపోవడంతో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. మణిపూర్ పై హోంమంత్రి అమిత్‌ షా బదులిస్తారని ప్రభుత్వం చెప్పింది. అయినా సరే ప్రతిపక్షాలు వెనక్కి తగ్గలేదు. ప్రధానే మాట్లాడాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే కేంద్రంపై అవిశ్వాస తీర్మాన అస్త్రాన్ని ప్రయోగించాయి.

తొలుత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్‌ గొగొయ్‌ చర్చను ప్రారంభించారు. దీంతో సభలో కాసేపు అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాహుల్ ఎందుకు చర్చ ప్రారంభించలేదని అధికార పక్షం సభ్యులు నిలదీశారు.

Advertisement

తాము అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చేలా పరిస్థితులు తలెత్తాయని గౌరవ్ గొగొయ్ అన్నారు. లోక్‌సభలో సంఖ్యా బలం గురించి తెలుసుకోవడానికి తెచ్చిన తీర్మానం కాదని స్పష్టం చేశారు. మణిపుర్‌కు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామన్నారు.

అవిశ్వాస తీర్మానంపై మొత్తం 16 గంటలపాటు చర్చ జరుగుతుంది. బీజేపీకి 6. 41 గంటలు, కాంగ్రెస్‌కు గంటా 9 నిమిషాలు కేటాయించారు. డీఎంకే, టీఎంసీకి  30 నిమిషాల చొప్పున సమయం ఇచ్చారు.వైసీపీ సభ్యులు 29 నిమిషాలు, శివసేన ఎంపీలు 24 నిమిషాలు మాట్లాడతారు. బీఆర్‌ఎస్‌, బీఎస్పీకి 12 నిమిషాల చొప్పున కేటాయించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×