E-Paper
Advertisement

Cyber Crime: క్రెడిట్ కార్డ్ అంటూ వల వేసిన కేటుగాడు.. రూ.7 లక్షలు పోగొట్టుకున్న మహిళ

Cyber Crime: క్రెడిట్ కార్డ్ అంటూ వల వేసిన కేటుగాడు.. రూ.7 లక్షలు పోగొట్టుకున్న మహిళ
Advertisement

Cyber Crime: ఉదయం లేసినప్పుడు మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు మనకు చాలా కాల్స్ వస్తుంటాయి. అందులో ఎక్కువగా బ్యాంక్ లోన్లు, క్రెడిట్ కార్డులు ఇస్తామని, బహుమతులు గెలుచుకున్నారని ఫేక్ కాల్స్ చేసే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఆ మాటలు నమ్మి వాళ్ల వలలో పడ్డామా.. ఇక అంతే సంగతి. క్షణాల్లో మన ఖాతాను ఖాలీ చేసేస్తారు. తాజాగా ముంబైకి చెందిన ఓ యువతి ఓ వ్యక్తి మాటలు నమ్మి ఏకంగా రూ. ఏడు లక్షలు పోగొట్టుకుంది.

ముంబైకి చెందిన ఓ యువతికి సౌరభ్ శర్మ అనే వ్యక్తి ఫోన్ చేసి తాను బ్యాంక్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. ఆమెకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేశాడు. అయితే ఆఫర్ నచ్చడంతో యువతి క్రెడిట్ కార్డు తీసుకునేందుకు రెడీ అయిపోయింది. కార్డు కోసం తన ఆధార్ కార్డును శర్మకు వాట్సాప్ ద్వారా పంపించింది. అనంతరం శర్మ ఓ లింకును యువతి ఫోన్‌కు పంపించి.. ఆండ్రాయిడ్ పోన్‌లో ఈ లింక్ ఓపెన్ చేసి క్రెడిట్ కార్డు ప్రాసెస్ చేయాలని సూచించాడు.

Advertisement

అయితే యువతి దగ్గర యాపిల్ ఫోన్ ఉండడంతో ఆమె ఇంటికి శర్మ ఓ ఆండ్రాయిడ్ ఫోన్‌ను పంపించాడు. అప్పటికే ఆ ఫోన్‌లో డాట్ సెక్యూర్, సెక్యూర్ ఎన్వాయ్ అథెంటికేషన్ అనే రెండు యాప్స్ ఉన్నాయి. అయినప్పటికీ యువతి శర్మ పంపించిన లింక్‌ను ఆఫోన్‌లో ఓపెన్ చేసి అతడు చెప్పినట్లుగా ప్రాసెస్ చేసింది.

వారం రోజుల్లో ఇంటికి క్రెడిక్ కార్డ్ వస్తుందని శర్మ యువతిని నమ్మించాడు. గంట తర్వాత యువతి అకౌంట్ నుంచి రూ. 7 లక్షల లావాదేవీలు జరిగినట్లు ఆమె ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. వెంటనే ఆమె బ్యాంక్‌కు వెళ్లి ఎంక్వైరీ చేయగా.. బెంగళూరులోని ఓ జ్యూవెల్లరీ షాపులో ఈ లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది. దీంతో మోసపోయానని గుర్తించిన మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×