E-Paper
Advertisement

CoWIN data: కొవిన్‌ డేటా లీక్‌.. టెలిగ్రామ్‌లో ప్రముఖుల సమాచారం..

CoWIN data: కొవిన్‌ డేటా లీక్‌.. టెలిగ్రామ్‌లో ప్రముఖుల సమాచారం..
Advertisement
cowin data leak

CoWIN data: కేంద్రం అత్యంత సురక్షితమని ప్రకటించిన కొవిన్ పోర్టల్‌ను హ్యాక్‌ చేశారు సైబర్ నేరగాళ్లు. కీలక వ్యక్తుల ఫోన్‌ నంబర్లు, ఆధార్ నెంబర్లతో సహా అన్ని వివరాలు ఇప్పుడు టెలిగ్రామ్‌లో ప్రత్యక్షమయ్యాయి. టెలిగ్రామ్‌ బాట్‌ను ఇప్పుడు దేశంలోని వీఐపీ గురించి ప్రశ్నలు అడిగితే.. అన్ని వివరాలను చూపిస్తోంది. దీంతో, చాట్‌బాట్‌ను నిలిపివేశారు.

కొవిన్ పోర్టల్‌ నుంచి లీకైన డేటాలో మంత్రి కేటీఆర్‌, డీఎంకే నేత కనిమొళి, కాంగ్రెస్‌ నేతలు చిదంబరం, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్‌, టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌, మాజీ కేంద్రమంత్రి హర్షవర్ధన్‌తో సహా అనేక మంది వీఐపీలు ఉన్నారు. డేటా లీక్‌పై కార్తీ చిదంబరం ట్వీట్ చేశారు. అత్యంత సురక్షితమైనదని గతంలో ప్రకటించిందని.. మరి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారంటూ ఆయన కేంద్రాన్ని నిలదీశారు.

Advertisement

ఈ లీక్ తో ఇప్పుడు దేశంలోని ప్రముఖుల వ్యక్తిగత సమాచారం అంగట్లో సరుకుగా మారిపోయింది. కొవిన్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకునేందుకు వీరంతా పాస్ పోర్ట్ నంబర్లు ఇచ్చారని తెలుస్తోంది. దాదాపు అందరి వివరాలు సరైనవే అని తెలుస్తోంది. ఇన్నాళ్లూ కొవిన్ గురించి గొప్పగా చెబుతూ వచ్చిన ప్రధాని మోదీ.. ఇప్పుడు డేటా లీక్‌కు బాధ్యత వహిస్తారా? అని నిలదీస్తున్నారు నెటిజన్లు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×