E-Paper
Advertisement

Udhayanidhi Stalin on BJP: చెత్త.. విషసర్పం.. మరోసారి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద కామెంట్స్..

Udhayanidhi Stalin on BJP: చెత్త.. విషసర్పం.. మరోసారి  ఉదయనిధి స్టాలిన్  వివాదాస్పద కామెంట్స్..
Advertisement
Udhayanidhi Stalin latest news

Udhayanidhi Stalin latest news(Politics news today India):

సనాతన ధర్మంపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈ సారి బీజేపీని టార్గెట్ చేశారు. కాషాయ పార్టీని విష సర్పంతో పోల్చారు. తాజాగా తమిళనాడు నైవేలీలో డీఎంకే ఎమ్మెల్యే సభా రాజేంద్రన్‌ నివాసంలో జరిగిన వివాహ వేడుకలో ఉదయనిధి పాల్గొన్నారు. ఈ సమయంలో మరోసారి ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

బీజేపీని టార్గెట్ చేసిన ఉదయనిధి.. ప్రతిపక్ష అన్నాడీఎంకేను పాములకు ఆశ్రయమిచ్చే పార్టీగా మారిందని పేర్కొన్నారు. ఇటీవల డీఎంకే నేత, మాజీ కేంద్రమంత్రి ఎ.రాజా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రధాని మోదీని పాముగా అభివర్ణించారు. ఇప్పుడు ఉదయనిధి బీజేపీని పాముగా పోల్చడంతో వివాదం రేగింది. విష సర్పం ఇంట్లోకి వస్తే తీసి బయట పడేస్తే కుదరదన్నారు. ఆ పాము ఇంటి చుట్టుపక్కల చెత్తలో దాక్కొంటుందని వివరించారు. ఆ చెత్తను తీసేసే వరకు ఆ పాము ఇంట్లోకి వస్తూనే ఉంటుందన్నారు.

Advertisement

తమిళనాడును ఇల్లుగా బీజేపీని విష సర్పంగా ఉదయనిధి అభివర్ణించారు. అన్నాడీఎంకేను ఇంటి వద్ద ఉన్న చెత్తగా పేర్కొన్నారు. చెత్తను తీసే వరకు విష సర్పం దూరం కాదన్నారు. బీజేపీ నుంచి విముక్తి పొందాలంటే అన్నాడీఎంకేను తొలగించాలని ఉదయనిధి హాట్ కామెంట్స్ చేశారు.

ఇటీవల సనాతన ధర్మంపై ఉదయనిధి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు పూర్తిగా తొలగించాలని పిలుపునిచ్చారు.ఈ కామెంట్స్ పై రాజకీయ దుమారం రేగింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×