E-Paper
Advertisement

Brij Bhushan Singh : బ్రిజ్ భూషణ్‌కు బెయిల్.. అందుకే అరెస్ట్ చేయలేదన్న పోలీసులు..

Brij Bhushan Singh : బ్రిజ్ భూషణ్‌కు బెయిల్.. అందుకే అరెస్ట్ చేయలేదన్న పోలీసులు..
Advertisement
Brij Bhushan Singh

Brij Bhushan Singh : రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు ఊరట లభించింది. ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. 25 వేల పూచీకత్తుపై 24 గంటల పాటు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. లైంగిక వేధింపుల కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ కు సంబంధించి న్యాయస్థానం బ్రిజ్ భూషన్ కు సమన్లు జారీ చేయగా.. మంగళవారం ఆయన కోర్టుకు హాజరయ్యారు.

Advertisement

మరోవైపు లైంగిక వేధింపుల కేసులో ఆధారాలున్నాయని పోలీసులు ప్రకటించినా.. ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదన్న దానిపై పోలీసులు వివరణ ఇచ్చారు. ఏడేళ్లు శిక్ష పడే అవకాశం ఉన్న కేసులో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సహకరిస్తే వారిని అరెస్ట్ చేయరాదన్న కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. బ్రిజ్ కు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలు దొరికాయన్న ఢిల్లీ పోలీసులు.. మరిన్ని ఆధారాల కోసం అన్వేషిస్తున్నామని తెలిపారు.

కొన్ని నెలలుగా మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ పై లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో బ్రిజ్ భూషణ్ ను విచారించిన ఢిల్లీ పోలీసులు.. పలు ఆధారాలు సేకరించారు. ఇన్నాళ్ల విచారణ తర్వాత జూలై 15 న రౌస్ ఎవెన్యూ కోర్టులో చార్జీషీట్ నమోదు చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×