E-Paper
Advertisement

Flight Emergency Landing : మాస్కో- గోవా ఫ్లైట్ కు బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌..

Flight Emergency Landing : మాస్కో- గోవా ఫ్లైట్ కు బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌..
Advertisement

Flight Emergency Landing : ఆ విమానం మాస్కో నుంచి గోవాకు వస్తోంది. అప్పటికే భారత్ గగనతలంలోకి ప్రవేశించింది. కాసేపట్లో గమ్యస్థానానికి చేరుకోబోతోంది. ఇంతలోనే ప్రయాణికులకు షాక్ తగిలే వార్త వినిపించింది. ఆ విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది.

విమానంలో బాంబు ఉన్నట్లు ఫోన్‌ రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. గోవాకు వెళ్లాల్సిన విమానాన్ని గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు మళ్లించారు. అక్కడే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. విమానంలో 236 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తం 244 మంది విమానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ ఫ్లైట్ లో ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదని వెల్లడించారు. బాంబు లేదని తేల్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

మాస్కో నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు సమాచారం రాగానే NSG సిబ్బంది అలెర్ట్ అయ్యారు. అత్యవసర ల్యాండింగ్ అయిన విమానం వద్దకు చేరుకుని లగేజీలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. విమానంలో అణువణువు గాలించారు. ఎన్‌ఎస్‌జీ సిబ్బందికి ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. ఈ విమానం చాలా పెద్దది. దీంతో తనిఖీలు చేసేందుకు చాలా సమయం పట్టిందని అధికారులు తెలిపారు. చివరకు విమాన క్యాబిన్ లోని మొత్తం లగేజ్ ను తనిఖీ చేసిన తర్వాత బాంబు లేదని తేల్చామని జామ్‌నగర్‌ ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ తెలిపారు. తనిఖీలన్నీ పూర్తైన విమానాన్ని జామ్‌నగర్‌ నుంచి గోవాకు విమానం పంపే ఏర్పాట్లు చేశారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×