E-Paper
Advertisement

Bank Theft: బ్యాంక్ స్ట్రాంగ్‌రూంలో సొరంగం తవ్వి.. 1.8 కేజీల బంగారం చోరీ

Bank Theft: బ్యాంక్ స్ట్రాంగ్‌రూంలో సొరంగం తవ్వి.. 1.8 కేజీల బంగారం చోరీ
Advertisement

Bank Theft: దొంగలు తెలివి మీరుతున్నారు. కాస్త కష్టమైనా.. పర్ ఫెక్ట్ గా చోరీలకు పాల్పడుతున్నారు. గేటు దూకడాలు.. తాళాలు పగలగొట్టడాలు కామన్ అనుకున్నారో ఏమో.. ఈసారి ఇంకాస్త వెరైటీగా ఆలోచించారు. ఏకంగా బ్యాంకు స్ట్రాంగ్‌రూంలోకి సొరంగం తవ్వి.. భారీ లూటీ చేశారు కేటుగాళ్లు.

జైలు నుంచి తప్పించుకోవడానికి ఖైదీలు సొరంగం తవ్వడం చూశాం. దొంగలు గోడకు రంధ్రం చేసిన ఘటనలూ అనేకం. కానీ, కాన్పూర్ లోని దొంగలు ఏకంగా బయటి నుంచి బ్యాంకు లాకర్ల కింది వరకూ సొరంగం తవ్వేశారు. ఎస్‌బీఐ భనుతి శాఖ బిల్డింగ్ లో పక్కనే ఉన్న ఖాళీ స్థలం నుంచి బ్యాంకు స్ట్రాంగ్ రూంలోకి 10 అడుగుల మేర సొరంగం తవ్వి లోపలికి జొరబడ్డారు దొంగలు. లాకర్ పగలగొట్టి.. అందులోని 1.8 కేజీల బంగారం దొంగిలించారు. మరో లాకర్ లో ఉన్న 32 లక్షలు దోచుకోడానికి ప్రయత్నించినా.. ఆ లాకర్ ను బ్రేక్ చేయలేకపోయారు.

Advertisement

మర్నాడు ఎప్పటిలానే బ్యాంకు తెరిచారు ఉద్యోగులు. సొరంగం చూసి ఉలిక్కిపడ్డారు. దొంగతనం జరిగిందని నిర్థారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేలి ముద్రలు, ఇతర ఆధారాల ద్వారా దొంగలను గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకు నిర్మాణం బాగా తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×