E-Paper
Advertisement

Bhupendra patel : నేడు గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం..కేబినెట్ లో వీరికి ఛాన్స్..?

Bhupendra patel : నేడు గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం..కేబినెట్ లో వీరికి ఛాన్స్..?
Advertisement

Bhupendra patel : గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజధాని గాంధీనగర్ లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్.. భూపేంద్ర పటేల్ తో ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. కొత్త సచివాలయం సమీపంలోని హైలీప్యాడ్ మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.

సీఎంతోపాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు కాను దేశాయ్, రాఘవ్ జీ పటేల్, రుషికేశ్ పటేల్, హర్ష్ సంఘవి, శంకర్ చౌదరి, పూర్ణేశ్ మోదీ, మనీశా వకీల్, రమణ్ లాల్ పాట్కర్ తదితరులను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

శుక్రవారం భూపేంద్ర పటేల్ మంత్రివర్గంసహా సీఎం పదవికి రాజీనామా చేశారు. శనివారం ఆయనను బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. 2021 సెప్టెంబర్ 13న తొలిసారి భూపేంద్ర పటేల్ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు రెండోసారి సీఎంగా అవకాశం దక్కించుకున్నారు. తాజా ఎన్నికల్లో భూపేంద్ర పటేల్ ఘట్లోడియా స్థానం నుంచి లక్షా 92 వేల మెజార్టీతో గెలిచారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 182 స్థానాలున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో 156 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుని రాష్ట్ర చరిత్ర సరికొత్త రికార్డు సృష్టించింది. కాంగ్రెస్ కు 17 , ఆప్ కు 5 స్థానాలు దక్కాయి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×