E-Paper
Advertisement

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాకు భారీ జరిమానా విధించిన RBI

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాకు భారీ జరిమానా విధించిన RBI
Advertisement

Bank of Baroda: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరోసారి భారీగా జరిమానా వడ్డించింది. చిరిగిన నోట్ల మార్పిడి లావాదేవీల్లో వ్యత్యాసం ఎక్కువగా కనిపించడంతో.. బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.5 కోట్ల జరిమానా విధించింది. ఈ విషయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా.. శుక్రవారం జరిగిన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో వెల్లడించింది. చిరిగిన నోట్ల లావాదేవీల్లో నకిలీ నోట్లు గుర్తించడంతో అదనంగా మరో రూ.2750 జరిమానా పడింది.

డిసెంబర్ 18,20 తేదీల్లో వేర్వేరుగా జరిమానాలు విధించినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది. గత నెలలో కూడా BOBకి ఆర్బీఐ పెనాల్టీ విధించింది. పెద్దమొత్తంలో రుణాలకు సంబంధించిన విషయంలో ఆర్బీఐ నిబంధనలు పాటించనందుకు గాను రూ.4.35 కోట్ల జరిమానా వేసింది.

Advertisement

అలాగే మహారాష్ట్రలోని ఠాణె జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు కూడా ఆర్బీఐ రూ.2 లక్షల రూపాయలు జరిమానా విధించింది. ఈ బ్యాంకు తమ బ్యాంక్ డైరెక్టర్లలో ఒకరికి ఋణం మంజూరు చేసిన కారణంగా ఈ జరిమానా విధించినట్లు వెల్లడించింది. ఈ బ్యాంక్ లో ఇటీవల నాబార్డ్ తనీఖీలు చేసింది. బ్యాంక్ డైరక్టర్ల లో ఒకరికి బ్యాంక్ రుణం మంజూరు చేసినట్లు తనిఖీల్లో తేలింది. దీంతో నిబంధనలను అతిక్రమించిన కారణంగా ఆర్ బీఐ టీడీసీసీకి పెనాల్టీ విధించింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×