E-Paper
Advertisement

Azim Premji : రూ.480 కోట్లు.. కొడుకులకు ప్రేమతో.. అజీమ్ ప్రేమ్‌జీ గిప్ట్..

Azim Premji : ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వాటా నుంచి 1.02 కోట్ల ఈక్విటీ షేర్ల ను తన ఇద్దరు కుమారులకు బదిలీ చేశారు. వీటి విలువ రూ.480 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ షేర్లను బహుమతిగా ఇచ్చినట్లు కంపెనీ తమ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రకటించింది.

Azim Premji : రూ.480 కోట్లు.. కొడుకులకు ప్రేమతో..  అజీమ్ ప్రేమ్‌జీ గిప్ట్..
Advertisement

Azim Premji : ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వాటా నుంచి 1.02 కోట్ల ఈక్విటీ షేర్ల‌ను తన ఇద్దరు కుమారులకు బదిలీ చేశారు. వీటి విలువ రూ.480 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ షేర్లను బహుమతిగా ఇచ్చినట్లు కంపెనీ తమ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రకటించింది.

విప్రో సంస్థలో అజీమ్‌ ప్రేమ్‌జీ 22.58కోట్ల షేర్లతో 4.32శాతం వాటాను కలిగి ఉన్నారు. దీనిలో నుంచి 0.20శాతం వాటాను తన కుమారులు రిషద్‌ ప్రేమ్‌జీ మరియు తారిఖ్‌ ప్రేమ్‌జీ‌కు సమానంగా బదిలీ చేశారు. అజీమ్ ప్రేమ్‌జీ మొత్తం 1.02 కోట్ల షేర్లను కానుకగా ఇచ్చారు. విప్రో షేరు ధర ప్రస్తుతం రూ.472.9 రూపాయలుగా ఉంది. ఆ లెక్కన దాదాపు రూ.483 కోట్ల రూపాయలను అజీమ్‌ తన వారసులకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ షేర్ల బదిలీతో కంపెనీలో ఆయన వాటా 4.32 శాతం నుంచి 4.12 శాతానికి తగ్గింది.

Advertisement

విప్రో సంస్థలో అజీమ్‌ ప్రేమ్‌జీ కుటుంబం మొత్తం 4.43 శాతం వాటాని కలిగి ఉంది. ఇందులో ఆయన భార్య 0.05శాతం వాటాను కలిగి ఉంది. ఇద్దరు కుమారులు 0.13 శాతం చొప్పున షేర్లను కలిగి ఉన్నారు. ప్రస్తుతం కంపెనీకి ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా రిషద్‌ ప్రేమ్‌జీ వ్యవహరిస్తున్నారు. మరో కుమారుడు తారిఖ్‌ ప్రేమ్‌జీ ఎండోమెంట్‌ ఫండ్‌ దాతృత్వ సంస్థ‌కు ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×