E-Paper
Advertisement

Ayodhya Shankaracharyulu : ఆలయం నిర్మాణం పూర్తికాకుండా.. రాముడి విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠిస్తారు?

Ayodhya Shankaracharyulu : ఆలయం నిర్మాణం పూర్తికాకుండా.. రాముడి విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠిస్తారు?
Advertisement

Ayodhya Shankaracharyulu : శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య ముస్తాబైతున్నది. మరో పది రోజులే గడువు ఉండటంతో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ క్రమంలో పలువురు శంకరాచార్యులు బాంబు పేల్చేశారు. రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి తాము హాజరుకాబోమని నలుగురు శంకరాచార్యులు ప్రకటించారు. ప్రతిష్ఠాపన వేడుకలను ఉత్తరాఖండ్‌‌‌‌ జ్యోతిష్ పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి, పూరీ గోవర్ధన్‌‌‌‌పీఠ్‌‌‌‌ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి పూర్తిగా వ్యతిరేకించారు. ఆలయ నిర్మాణం పూర్తి కాకుండా రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడమేమిటని నిలదీశారు.

ఇది హిందూమతానికి విరుద్ధమన్నారు. అసంపూర్తిగా ఉన్న ఆలయంలో దేవుడిని ప్రతిష్ఠించడం మంచిది కాదన్నారు. తమ నిర్ణయం ప్రధాని మోదీకి వ్యతిరేకం కాదని.. తాము ధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా కూడా వెళ్లలేమని స్పష్టం చేశారు. అలాగే శృంగేరి పీఠాధిపతి స్వామి భారతీకృష్ణాజీ, ద్వారక పీఠాధిపతి స్వామి సదానంద్ మహరాజ్ కూడా గుడి పూర్తికాకుండానే విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తుండటాన్ని వ్యతిరేకించారు. మరోవైపు రామ మందిరం ప్రారంభోత్సవం రోజైన ఈ నెల 22న అయోధ్యలోని వాల్మీకి మహర్షి ఎయిర్‌‌‌‌పోర్టులో ఏకంగా 100 చార్టర్డ్‌‌ ఫ్లైట్స్ ల్యాండ్ కానున్నాయి. 500 కిలోల బరువు ఉన్న డోలు.. ప్రత్యేక రథంలో గుజరాత్ నుంచి అయోధ్యకు చేరుకుంది.

Advertisement

.

.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×