E-Paper
Advertisement

Ayodhya Ram Mandir : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ.. అమెరికా టైమ్స్ స్కేర్స్ లో లైవ్ టెలీకాస్ట్..

Ayodhya Ram Mandir : అయోధ్యలో త్వరలో జరగబోయే శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను.. అమెరికాలోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.

Ayodhya Ram Mandir : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ.. అమెరికా టైమ్స్ స్కేర్స్ లో లైవ్ టెలీకాస్ట్..
Advertisement
This image has an empty alt attribute; its file name is d8b79f00ae4b00ee93c1f5d48cf510a3.jpg

Ayodhya Ram Mandir : అయోధ్యలో త్వరలో జరగబోయే శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను.. అమెరికాలోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయంలో శ్రీ రాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ వేడుకను వీక్షించేందుకు కోట్లాది మంది భారతీయులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఆ కార్యక్రమాన్ని నేరుగా తిలకించేందుకు అందరికీ సాధ్యం కాదు. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు భారతీయ ఎంబసీలు, కాన్సులేట్లలోనూ లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు సమాచారం.

Advertisement

అంతేకాదు.. అమెరికాలోని న్యూయార్క్‌లో గల ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌లో ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా పూర్త అయనట్లు సమచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రాణప్రతిష్ఠ పూర్తయిన అనంతరం భక్తులనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నట్లు తెలిసింది. దీన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు సమాచారం.

టైమ్స్‌ స్క్వేర్‌లో రామ మందిరాన్ని ప్రదర్శించడం తొలిసారి కాదు. 2020 ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ భూమిపూజ చేశారు. అప్పుడు టైమ్స్‌ స్క్వేర్‌లో రామమందిర చిత్రాన్ని ప్రదర్శించారు.

Advertisement

జనవరి 22న అయోధ్య భవ్య రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, వేలాది మంది సాధువులు హాజరుకానున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×