E-Paper
Advertisement

Ayodhya Express: వెలిగిపోనున్న వారణాసి.. ముంబైలో లక్ష దీపోత్సవం

Ayodhya Express: వెలిగిపోనున్న వారణాసి.. ముంబైలో లక్ష దీపోత్సవం
Advertisement

Ayodhya Express: బాలరాముడి ప్రతిష్టాపన కోసం అయోధ్య సిద్ధమవుతోంది. 2 వేల 100 బ్యారేళ్ల ఆవనూనె అయోధ్యకు చేరుకుంది. సీతా రసోయి కార్యక్రమంలో ఈ నూనెను ఉపయోగించనున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌ నుంచి ఈ వాహనాలు వచ్చాయి. రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ.. గవర్నర్‌ మిశ్రా ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

Plastic free Clean Ayodhya

Advertisement

ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరగా ముస్తాభవుతున్న అయోధ్యలో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు అధికారులు. క్లీన్ అయోధ్య, ప్లాస్టిక్‌ ఫ్రీ అయోధ్య డ్రైవ్‌ను చేపట్టారు. ఇప్పటికే అయోధ్యను క్లీన్ చేసే పనులను ప్రారంభించారు.

U P Holiday on Jan 22

Advertisement

అయోధ్య భవ్యమందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగే రోజైన జనవరి 22న యూపీ వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యానాథ్. ఆరోజు లిక్కర్‌ షాపులను మూసేయాలని ఆదేశించారు. అయోధ్యలో జరుగుతున్న ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

VARANASI DEEPOTSAV

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన రోజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్రమోడీ. దీంతో వారణాసిలో ఒక్కసారిగా దీపాల కొనుగోళ్లు పెరిగాయి. ఆ రోజున వారణాసిలో దీపోత్సవ్ నిర్వహించాలని పిలుపునివ్వడంతో ఒక్కసారిగా దీపాలకు డిమాండ్ పెరిగింది.

MUMBAI DEEPOTSAV

ముంబైలో కూడా జనవరి 22న దీపోత్సవ్ నిర్వహించనున్నారు రామ భక్తులు. లక్ష దీపాలతో దీపోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. దీని కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లను చేస్తున్నారు.

AYODHYA AKHAND JYOTHI

బాలరాముడి ప్రతిష్టాపన అనంతరం వెలిగించే అఖండ జ్యోతి అయోధ్యకు చేరుకుంది. గర్భగుడిలో ఉండే ఈ అఖండ జ్యోతిని ప్రత్యేకంగా తయారు చేయించారు. 25 ఏళ్ల పాటు ఈ అఖండ జ్యోతి సేవలందించనుందని తయారీదారులు తెలిపారు.

AYODHYA GOLDEN DOORS

అయోధ్య రామ‌మందిరానికి మొద‌టి బంగారు త‌లుపును ఏర్పాటు చేశారు. గ‌ర్భగుడి మొదటి అంత‌స్తులో ఈ బంగారు త‌లుపును ఏర్పాటు చేశారు. మరో మూడు రోజుల్లో మరో 13 బంగారు తలుపులు ఆలయంలో ఏర్పాటు చేయనున్నారు. ఆల‌యంలో మొత్తం 46 త‌లుపుల‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో 42 త‌లుపుల‌కు బంగారు పూత పూయ‌నున్నారు.

AYODHYA AIRPORT SECURITIES

అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్టకు 7 వేల మంది వీవీఐపీలు హాజరవుతున్నారు. దీంతో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్య ఎయిర్‌పోర్ట్‌లో 150 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కమాండోలను మోహరించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. కేంద్ర భద్రత, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమీక్షలో ఈ ఎయిర్‌పోర్ట్‌కు CISF ప్రొఫెషనల్ సెక్యూరిటీని సిఫార్సు చేయడంతో కేంద్రం ఆమోద ముద్ర వేసింది.

.

.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×