E-Paper
Advertisement

Assembly Bypolls In India : మునుగోడుతో కలిపి దేశంలో 6 రాష్ట్రాల్లో 7 స్థానాలకు ముగిసిన ఉపఎన్నికలు..

Assembly Bypolls In India : మునుగోడుతో కలిపి దేశంలో 6 రాష్ట్రాల్లో 7 స్థానాలకు ముగిసిన ఉపఎన్నికలు..
Advertisement

Assembly Bypolls In India : నిన్న మునుగోడు ఉపఎన్నికల ఫలితాలతో పాటు దేశవ్యాప్తంగా ఇలా ఆరు ఉపఎన్నికల ఫలితాలు వచ్చాయి. తెలంగాణ, యూపీ, హరియాణ, మహారాష్ట్ర, ఒడిశా, బిహార్ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. తెలంగాణలో బీజేపీ రెండవ స్థానంలో నిలిచి పరాజయం పొందినా.. హరియాణ, ఒడిశా, యూవీ, బిహార్‌లో కమలనాధులు గెలిచారు.

ఇక భాజపాకు తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కూడా ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ ఏక్‌నాధ్ షిండే తిరుగుబాటు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత వచ్చిన మొదటి ఉపఎన్నిక. అంధేరి (తూర్పు) నియోజకవర్గం ఉపఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే వర్గం అభ్యర్ధి రుతుజ లట్కే గెలుపొందారు. ఇందులో మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. రెండవ స్థానంలో ప్రత్యర్ధి పార్టీలకు వచ్చిన ఓట్లకంటే నోటాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి.

Advertisement

హరియాణాలో అదంపూర్ ఉపఎన్నికల్లో బీజేపీ తరపున మాజీ సీఎం భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ గెలుపొందారు. ఒడిశా ధామ్‌నగర్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ తరుపున సూర్యభన్షి సూరజ్ దక్కించుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే అర్వింద్ గిరి తనయుడు అమన్‌గిరి.. గోలా గోకర్ణ్‌నాధ్ సీటును దక్కించుకున్నారు. బిహార్‌లో గోపాల్‌గంజ్, మొకామా రెండు స్థానాలకు ఉపఎన్నిక జరగగా గోపాల్‌గంజ్‌ను బీజేపీ, మోకామాను ఆర్జేడీ దక్కించుకుంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×