E-Paper
Advertisement

Parliament : ప్రతి అంశాన్ని చర్చిద్దాం.. అఖిలపక్ష భేటీలో కేంద్ర మంత్రుల హామీ..!

Parliament : జనవరి 31 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి . ఈ సమావేశాల్లో ప్రతి అంశాన్ని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ఏర్పాటుచేసిన అఖిలపక్ష భేటీలో వివిధ పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రభుత్వం తరఫున మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, రాజ్‌నాథ్‌ సింగ్‌, అర్జున్‌రామ్‌ మేఘవాల్‌లు హాజరయ్యారు.

మల్లికార్జున ఖర్గే తరఫున హాజరైన కాంగ్రెస్‌ నేత ప్రమోద్‌ తివారీ మీడియాతో మాట్లాడారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో న్యాయయాత్ర’ సందర్భంగా అస్సాంలో జరిగిన ఘర్షణను ఈ భేటీలో లేవనెత్తినట్లు ఆయన పేర్కొన్నారు. ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ వంటి నేతలను సీఐడీ లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆరోపించారు. సీబీఐ, ఈడీలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని పేర్కొన్నారు.

Advertisement

జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే చివరి పార్లమెంటరీ సమావేశాలు ఇవే. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతుంది. ప్రతి పార్లమెంటు సమావేశాల ముందు అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×