E-Paper
Advertisement

Accident : ట్రక్కును ఢీకొట్టిన షిర్డీ యాత్రికుల బస్సు..10 మంది మృతి..

Accident : ట్రక్కును ఢీకొట్టిన షిర్డీ యాత్రికుల బస్సు..10 మంది మృతి..
Advertisement

Accident : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. షిర్డీ యాత్రికులతో వెళ్తోన్న ఓ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు.

ఠాణె జిల్లా నుంచి యాత్రికులతో ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సు షిర్డీకి బయల్దేరింది. శుక్రవారం ఉదయం నాసిక్‌-షిర్డీ హైవేపై ఈ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

నాసిక్‌ – షిర్డీ హైవేపై జరిగిన బస్సు ప్రమాద ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండేతీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×