E-Paper
Advertisement

MCD Election : ఆప్ 10 హామీలు.. ఢిల్లీలో బీజేపీతో ఢీ అంటే ఢీ

MCD Election : ఆప్ 10 హామీలు.. ఢిల్లీలో బీజేపీతో ఢీ అంటే ఢీ
Advertisement

MCD Election : ఢిల్లీ మున్సిపల్స్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సీఎం కేజ్రీవాల్ అడుగులు వేస్తున్నారు. డిసెంబర్‌ 4న ఎన్నికలు జరగనున్నారు. ఢిల్లీలో మొత్తం 250 వార్డులు ఉన్నాయి. ఓటర్లను ఆకట్టుకొనేందుకు బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌ ప్రచారం ముమ్మరం చేశాయి. ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ కీలక హామీలు ఇచ్చారు.
ఆప్‌ ఏం చెబుతుందో.. అదే అమలు చేస్తుందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతిని అంతం చేస్తామని స్పష్టం చేశారు. స్వచ్ఛ ఢిల్లీగా మారుస్తామని వాగ్దానం చేశారు. బీజేపీపై విమర్శలు గుప్పించారు. కాషాయ నేతలు ఇచ్చిన హామీలను ఎన్నికల తర్వాత మర్చిపోతారని ఆరోపించారు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు నిధులు మంజూరు చేయడంలేదని తనను నిందిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని కేంద్రం ఆరోపణలు చేయడం చరిత్రలో ఇదే తొలిసారన్నారు. ఢిల్లీని చెత్త రహిత నగరం మార్చేందుకు కేంద్రం నిధులు తెస్తామని గతంలో హామీ ఇచ్చిన హామీ సంగతేంటని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 20కి మించి సీట్లు రావని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు.

ఢిల్లీలో 250 వార్డులకు డిసెంబర్‌ 4న ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 7న ఫలితాలు వెల్లడవుతాయి. 2007 నుంచి ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీనే విజయం సాధిస్తూ వస్తోంది. 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 181 సీట్లు కైవసం చేసుకుంది. అప్పుడు ఆప్‌ 49 స్థానాలు, కాంగ్రెస్‌ 31 సీట్లు గెలుచుకున్నాయి. అప్పుడు ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 272 వార్డులు ఉండేవి. అయితే ఈ ఏడాది వార్డుల సంఖ్యను 250కి తగ్గించారు.

Advertisement

కేజ్రీవాల్ ఇచ్చిన హామీలివే

  1. ఢిల్లీ నగరాన్ని సుందరీకరిస్తాం
  2. ఢిల్లీలోని రోడ్లు, వీధుల్ని శుభ్రపరుస్తాం
  3. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పాఠశాలలు, ఆస్పత్రులను పరిశుభ్రంగా ఉంచుతాం
  4. పార్కింగ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం
  5. ఢిల్లీలో వీధికుక్కలు, కోతుల బెడద నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తాం
  6. పురపాలక పాఠశాలలు, ఆస్పత్రుల్లో వసతులు మెరుగుపరుస్తాం
  7. నగరాన్ని పార్కుల నగరంగా మారుస్తాం
  8. తాత్కాలిక ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తాం, వేతనాలు సకాలంలో చెల్లిస్తాం
  9. వర్తకులకు ఆన్‌లైన్‌లోనే లైసెన్సులు మంజూరు చేస్తాం
  10. 10.వీధి వ్యాపారుల కోసం పరిశుభ్రమైన వాణిజ్య జోన్‌లు ఏర్పాటు చేస్తాం

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×