E-Paper
Advertisement

Crime: విలాసాలకు అలవాటు పడి ఏం చేసిందంటే?

Crime: విలాసాలకు అలవాటు పడి ఏం చేసిందంటే?
Advertisement

Crime: విలాసాలకు అలవాటు పడి కొందరు తప్పుడు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. మద్యం, డ్రగ్స్ మత్తులో చేయకూడని పనులు చేస్తున్నారు. విలాసాలకు రుచి మరిగి ఖర్చుల కోసం కిడ్నీలను కూడా అమ్ముకున్న వారిని చూశాం. తాజాగా విలాసాలకు, మద్యం, మత్తు పదార్థాలకు బానిసైన ఓ మహిళ ఏకంగా తన అండాలను అమ్ముకుంది. ఈ ఘటన గుజరాత్‌లోని అమ్రైవాడీలో చోటుచేసుకుంది.

అమ్రైవాడీకి చెందిన అనిత అనే మహిళకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లి అయిన కొద్దిరోజులకే కుటుంబంలో గొడవలు తలెత్తడంతో.. అనిత ఒత్తిడితో ఆమె భర్త అద్దె ఇంట్లో వేరే కాపురం పెట్టాడు. అక్కడ కూడా భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరిగేది. దీంతో విసుగు చెందిన భర్త ఆమెను వదిలిపెట్టి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడు. కొన్ని రోజులు దూరంగా ఉన్న తర్వాత మళ్లీ కలిసి జీవించడం ప్రారంభించారు.

Advertisement

అయితే దూరంగా ఉన్న సమయంలో అనిత విలాసాలకు ఎక్కువగా అలవాటు పడింది. ఖర్చులకు డబ్బులు లేక అహ్మదాబాద్‌కు చెందిన ఓ ఏజెంట్ సాయంతో అండాలను అమ్ముకోవడం మొదలుపెట్టింది. అండాల విక్రయానికి వీలుగా ఆధార్ కార్డులో పుట్టిన తేదీని మార్చుకుంది. అలాగే తన భర్త అనుమతితోనే అండాలను విక్రయిస్తున్నట్లు ఫోర్జరీ పత్రాలను కూడా సృష్టించింది.

ఈ విషయం తెలుసుకున్న భర్త అనితను నిలదీశాడు. కోపం పెంచుకున్న అనిత ఏజెంట్ సాయంతో విషయాన్ని బయటకు చెబితే చంపుతామంటూ బెదిరించింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2019-2022లో పలుమార్లు ఆమె అండాలను విక్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అనితను, ఆమెకు సహకరించిన ఏజెంట్‌ను అరెస్ట్ చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×