E-Paper
Advertisement

Fancy Number: ఫ్యాన్సీ నంబర్ల మోజు.. లక్ష రూపాయల స్కూటీ కోసం.. కోటి రూపాయల నంబర్

Fancy Number: ఫ్యాన్సీ నంబర్ల మోజు.. లక్ష రూపాయల స్కూటీ కోసం.. కోటి రూపాయల నంబర్
Advertisement

Fancy Number: కొందరికి ఫ్యాన్సీ నంబర్ల మోజు ఉంటుంది. ఎంతంటే.. ఆ నంబర్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడనంత. కోట్ల రూపాయలను కుమ్మరించి ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకుంటారు. ఫ్యాన్సీ నంబర్ల పేరుతో ప్రతి ఏడాది రవాణా శాఖ ఖజానాకు కోట్ల రూపాయల అదనపు సంపాదన వచ్చి చేరుతోంది.

ఇలాగే హిమాచల్ ప్రదేశ్‌లో ఓ వ్యక్తి ఫ్యాన్సీ నంబర్ కోసం ఏకంగా కోటి రూపాయలు పెట్టడానికి ముందుకొచ్చాడు. ఇటీవల శిమ్లాలో హెచ్‌పీ 999999 అనే నంబర్‌ను రావాణా శాఖ వేలానికి పెట్టింది. దాని రిజర్వు ధరను రూ.1,000గా నిర్దారించింది. ఆ నంబర్‌ను దక్కించుకోవడానికి చాలా మంది పోటీ పడగా.. ఓ వ్యక్తి ఏకంగా రూ. 1,00,11,000కు బిడ్ దాఖలు చేశాడు.

Advertisement

అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడంటే.. దాన్ని అమర్చబోయే కారు ఏ బీఎండబ్ల్యూ, ఆడి, బెంజ్ అనుకునేరు.. అస్సలు కాదు. ఇటీవల అతడు కొనుగోలు చేసిన స్కూటీ కోసం. దాని ధర కేవలం లక్ష రూపాయాలు. ఆ నంబర్ కోసం పెట్టే డబ్బులతో అలాంటి స్కూటీలను 100 కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు.. దాని బదులుగా ఓ లగ్జరీ కారు కొనుక్కోవచ్చు కదా అని కామెంట్లు పెడుతున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×