// // Chhattisgarh: ఐదేళ్లకే ఆ బాలుడికి కానిస్టేబుల్ ఉద్యోగం.. ఎక్కడంటే? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Chhattisgarh: ఐదేళ్లకే ఆ బాలుడికి కానిస్టేబుల్ ఉద్యోగం.. ఎక్కడంటే?

Chhattisgarh: ఐదేళ్లకే ఆ బాలుడికి కానిస్టేబుల్ ఉద్యోగం.. ఎక్కడంటే?
Advertisement

Chhattisgarh: అరుధైన వ్యాధితో బాధపడుతున్న బాలుడి చివరి కోరిక తీర్చేందుకు ఒక్కరోజు పోలీసుగా అధికారులు అవకాశం ఇచ్చిన ఘటనలు సినిమాల్లో, నిజజీవితంలో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం నిజంగానే ఓ యూకేజీ స్టూడెంట్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లాలో చోటుచేసుకుంది.

రాజ్‌కుమార్ రాజ్‌వాడే అనే వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేవాడు. ఇటీవల అతడు విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈక్రమంలో పోలీస్ శాఖ నిబంధనల ప్రకారం కారుణ్య నియామకం కింద రాజ్‌కుమార్ ఉద్యోగాన్ని అతడి కుమారుడు నమాన్‌ రాజ్‌వాడేకు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.

Advertisement

ఈమేరకు యూకేజీ చదువుతున్న ఐదేళ్ల నమాన్‌కు కానిస్టేబుల్‌గా నియామక పత్రాన్ని అందజేశారు. ఆ బాలుడికి 18 ఏళ్లు పూర్తయిన తర్వాత ఉద్యోగంలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. భర్త చనిపోయి బాధలో ఉన్నప్పటికీ… కొడుకుకు ఉద్యోగం రావడంతో నయాన్ తల్లి ఆనందం వ్యక్తం చేసింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×