// // India Covid Cases: భారత్ లో కోవిడ్ ప్రకంపనలు.. అప్రమత్తంగా ఉండాలన్న డబ్ల్యూహెచ్ఓ - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

India Covid Cases: భారత్ లో కోవిడ్ ప్రకంపనలు.. అప్రమత్తంగా ఉండాలన్న డబ్ల్యూహెచ్ఓ

India Covid Cases: భారత్ లో కోవిడ్ ప్రకంపనలు.. అప్రమత్తంగా ఉండాలన్న డబ్ల్యూహెచ్ఓ
Advertisement

India Covid Cases: భారత్‌లో మళ్లీ కరోనా ప్రకంపనలు రేపుతోంది. ఆదివారం దేశవ్యాప్తంగా 335 కొత్త కరోనా కేసులు వెలుగులోకి రావడంతో.. ప్రజల్లో గుబులు మొదలైంది. ఇదిలా ఉండగా ఈ కరోనాతో కొత్తగా ఐదుగురు చనిపోవడంతో.. తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,701గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మృతుల్లో నలుగురు కేరళ వాసులు ఉండగా.. యూపీలో ఓ వ్యక్తి కరోనాతో కన్నుమూశారు.

ఇదే సమయంలో.. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో.. డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు చేసింది. వ్యాధి వ్యాప్తి తీరును జాగ్రత్తగా పరిశీలించాలని, వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ సమాచారం ఎప్పటికప్పుడు పంచుకోవాలని పేర్కొంది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక విభాగం చీఫ్ డాక్టర్ మరియా వాన్ ఖర్కోవ్ కీలక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల కేసులకు గల కారణాలను ఆమె వివరించారు.

Advertisement

ప్రస్తుతం కోవిడ్ తో పాటు ఇన్ ఫ్లుయెంజా, బ్యాక్టీరియా, ఇతర వైరస్ లు వ్యాప్తిలో ఉన్నాయని, హాలిడే సీజన్ కావడంతో పెద్దఎత్తున వేడుకల్లో పాల్గొంటుండటం వల్లే కేసులు పెరుగుతున్నాయని ఆమె తెలిపారు. కోవిడ్ వైరస్ మారుతుండటం వల్ల కూడా కేసులు పెరుగుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 68 శాతం కేసులకు కోవిడ్ XB వేరియంట్ కుటుంబానికి చెందిన వైరస్ లు, జేఎన్ 1 వంటి సబ్ వేరియంట్లే కారణమని వివరించారు. భారత్ లో కోవిడ్ సబ్ వేరియంట్ అయిన జేఎన్ 1 బయటపడింది. మరోవైపు సింగపూర్ లో కేసులు పెరుగుతుండటంతో.. మళ్లీ మాస్క్ తప్పనిసరి చేశారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×