E-Paper
Advertisement

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది సజీవదహనం..

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది సజీవదహనం..
Advertisement
morning news today telugu

Madhya Pradesh latest news(Morning news today telugu):

మధ్యప్రదేశ్‌లో రహదారులు రక్తమోడాయి. బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. మధ్యప్రదేశ్‌ గుణ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గుణ జిల్లాలో ఓ ట్రక్కును బస్సు ఢీకొనడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బుధవారం రాత్రి బస్సు గుణ నుంచి ఆరోన్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి 8.30గంటల ప్రాంతంలో గుణ జిల్లాలో ప్రైవేటు బస్సు..ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో బస్సు బోల్తాపడింది. అనంతరం బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 13 మంది సజీవదహనమైనట్లు ఆ జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మంటల్లో చిక్కుకున్న పలువురు ప్రయాణికులను రక్షించి ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ విచారణకు ఆదేశించారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖను ఆదేశించారు. బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 4లక్షలు చొప్పున.. క్షతగాత్రులకు 50వేల చొప్పున పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×