E-Paper
Advertisement

Yellamma Movie: దేవిశ్రీ ఎల్లమ్మ కోసం మరోస్టార్ హీరో .. పక్కాగా ప్లాన్ చేస్తున్న వేణు!

Yellamma Movie: దేవిశ్రీ ఎల్లమ్మ కోసం మరోస్టార్ హీరో .. పక్కాగా ప్లాన్ చేస్తున్న వేణు!
Advertisement

Yellamma Movie: బలగం సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఎన్నో పురస్కారాలను అవార్డులను సొంతం చేసుకున్నారు దర్శకుడు వేణు(Venu). జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్న వేణు ప్రస్తుతం దర్శకుడిగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇక బలగం సినిమా(Balagam Movie) మంచి సక్సెస్ కావడంతో ఈయన దిల్ రాజు బ్యానర్ లోనే మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఎల్లమ్మ (Yellamma) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు జరగాల్సి ఉండగా హీరో దొరకని నేపథ్యంలో ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది హీరోలు ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో చివరికి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ను హీరోగా ఎంపిక చేస్తూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.

హీరోగా దేవిశ్రీప్రసాద్..

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ పోస్టర్ తో పాటు ఒక గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) పస్ట్ లుక్ కూడా విడుదల చేయడంతో ఈ సినిమా పట్ల మంచి అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్ని రోజులు సంగీత దర్శకుడుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందుకున్న దేవిశ్రీప్రసాద్ తెరపై హీరోగా కనిపించబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి.

దేవిశ్రీప్రసాద్ తండ్రి పాత్రలో..

Advertisement

ఇక ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో కీలకపాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది . ఇండస్ట్రీ సమాచారం ప్రకారం.. సీనియర్ నటుడు రాజశేఖర్ (Rajasekhar)ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే రాజశేఖర్ ఎంపిక కూడా పూర్తి అయిందని త్వరలోనే ఈయన షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ఇలా దేవిశ్రీప్రసాద్ తండ్రిగా రాజశేఖర్ కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజశేఖర్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎల్లమ్మ హీరోయిన్ ..

Advertisement

ఎల్లమ్మ సినిమాలో రాజశేఖర్ నటిస్తున్నారంటూ వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్గా ఎవరు కనిపించబోతున్నారు అనే విషయంపై కూడా ఎంతో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు హీరోయిన్ గురించి కూడా ఎలాంటి సమాచారం తెలియచేయలేదు. మొదట్లో కీర్తి సురేష్ నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ అందులో నిజం లేదని తెలుస్తుంది.

Also Read: MSVPG Film: మన శంకర వరప్రసాద్ గారి ఇంటిని చూశారా? ఇంద్ర భవనమే.. హోమ్ టూర్ వీడియో వైరల్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×