E-Paper
Advertisement

Year Ender 2025 : ఈ ఏడాదిలో సెలబ్రిటీల కాంట్రవర్సీలు.. దీపికా పదుకొనే నుంచి శివాజీ వరకు..

Year Ender 2025 : ఈ ఏడాదిలో సెలబ్రిటీల కాంట్రవర్సీలు.. దీపికా పదుకొనే నుంచి శివాజీ వరకు..
Advertisement

Year Ender 2025 : గత ఏడాది సెలబ్రిటీల సీక్రెట్ ప్రేమాయణాలు, సినిమాలు, స్టేడియంలో హీరోయిన్ల సందడి, సోషల్ మీడియాలో స్టార్స్ హంగామా చూసాము.. కానీ ఈ ఏడాది కాస్త ఇండస్ట్రీలో వివాదాలు ఎక్కువ అయ్యాయి. ఈ ఏడాది సెలబ్రిటీలు నోరు జారి అడ్డంగా బుక్కైన ఘటనలు చాలానే ఉన్నాయి.. ఇండస్ట్రీలలో స్టార్స్ గా కొనసాగుతున్న హీరోయిన్లు, హీరోలు అలాగే కమెడియన్లు సైతం కొన్ని కాంట్రవర్సీ లకు కేరాఫ్ గా మారారు.. ఇందులో దీపికా పదుకొణే 8 గంటల వర్క్ డిమాండ్ నుంచి తాజాగా శివాజీ మహిళల వస్త్రదారణ పై చేసిన అసభ్యకర కామెంట్స్ వరకు ఎన్నో ఉన్నాయి. అవేంటో ఒకసారి ఇప్పుడు మరోసారి గుర్తుచేసుకుందాం..

2025 లో సినీ తారల మెడకు చుట్టుకున్న వివాదాలు..

దీపికా 8 గంటలకు వర్క్..

గతంలో ఏ హీరోయిన్ కూడా పెట్టని విధంగా బాలీవుడ్ హీరోయిన్ దీపిక కండిషన్ లో పెట్టింది. అదే ఈ ఏడాది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ మూవీలో ఈమె నటించాల్సి ఉంది. కానీ ఆమె 8 గంటలు మాత్రమే పనిచేస్తాను అని కండిషన్ పెట్టడంతో ఆ సినిమా నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది.. ఇది అటు బాలీవుడ్ లను ఇటు టాలీవుడ్లను చర్చినీయాంశంగా మారింది..

రణవీర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు…

Advertisement

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఇండియాస్ గాట్ లేటెంట్’ అనే సమయ్ రైనా షో తీవ్రమైన ట్రోల్ కు గురైంది. సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు గురయ్యాయి. ఇదొక్కటి మాత్రమే కాదు అటు కాంతార చాప్టర్ 1 సినిమా ఈవెంట్ విషయంలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి.. ఇవి ఆయనకు వివాదాలను తెచ్చిపెట్టాయి..

సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు…

స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కత్తిపోటుకు గురైన విషయం తెలిసిందే.. ఈ ఏడది ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ గా మారింది.. అతని బాంద్రా నివాసంలోకి చొరబడిన దుండగుడు సైఫ్ లో హత్యాయత్నం చేశాడు. సంఘటన సమయంలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఎవరు హత్య ప్రయత్నం చేశారన్నది ప్రస్తుతం పోలీసులు చేధించే పనిలో ఉన్నారు..

శివాజీ అసభ్యకర వ్యాఖ్యలు..

Advertisement

టాలీవుడ్ నటుడు శివాజీ ఇటీవల దండోరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మహిళల వస్త్రధారణ పై చేసిన కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.. ఆయన వ్యాఖ్యలపై కొందరు సమర్థిస్తే మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. దీనిపై క్షమాపణ కోరుతూ వివరణ ఇచ్చిన కూడా వివాదాలు మాత్రం ఆగడం లేదు. ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.. ఈ ఏడాది చివరగా ఇదే హైలెట్ కాంట్రవర్సీ..

Also Read :ఓ వ్యక్తి చేతిలో దారుణంగా మోసపోయిన మ్యూజిక్ డైరెక్టర్.. తల్లి అంత్యక్రియలు

ఇవే కాదు కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ మరణించిన తర్వాత ఆస్తుల పై జరిగిన చర్చ, అమితాబ్ బచ్చన్ భార్య జయ బచ్చన్ ఇటీవల ఫొటోగ్రాఫర్లపై ఆగ్రహం వెళ్లగక్కడం తెలిసిందే.. వీటితోపాటు మరికొన్ని వివాదాలు కూడా ఉన్నాయి.. ఇవన్నీ కూడా ఈ ఏడాదిలో కాంట్రవర్సీగా మారిన వివాదాలు..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×