E-Paper
Advertisement

Yash Toxic: యశ్ టాక్సిక్ ముందు సవాలక్ష అడ్డంకులు.. విడుదల వాయిదా పడేనా?

Yash Toxic: యశ్ టాక్సిక్ ముందు సవాలక్ష అడ్డంకులు.. విడుదల వాయిదా పడేనా?
Advertisement

Yash Toxic: మార్చి 19 తేదీ భారతీయ సినిమా బాక్సాఫీస్‌కు చాలా కీలకంగా మారబోతోంది. అదే రోజున రెండు భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఒకటి ఆదిత్య ధార్ దర్శకత్వంలో వస్తున్న ధురంధర్ పార్ట్ 2, మరొకటి యశ్ హీరోగా నటిస్తున్న టాక్సిక్. ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉండబోతుందని ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ క్రమంలో యాశ్ సినిమా వాయిదా పడుతుంది అన్న వార్తలు వచ్చిన.. అది జరిగేలా లేదు. యాశ్ తప్పకుండా అనుకున్నదే సినిమా విడుదల చేయాలి అనుకుంటున్నారంట.

వాయిదా గురించి మాట్లాడుకునే ముందుగా ధురంధర్ పార్ట్ 2 గురించి చెప్పుకోవాలి. మొదటి భాగానికి వచ్చిన పేరు, దేశవ్యాప్తంగా ఏర్పడిన క్రేజ్ కారణంగా ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్, ప్రమోషన్లు చూసిన తర్వాత సినిమా పై మరింత బజ్ పెరిగింది. ఇప్పటికే ఈ సినిమాకు బలమైన ఆడియన్స్ బేస్ ఉంది. అందుకే దీన్ని ఎదుర్కొనడం ఏ సినిమాకైనా సవాలే అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

అయితే టాక్సిక్ మాత్రం ఈ పోటీ నుంచి వెనక్కి తగ్గే ఆలోచనలో లేదు. యశ్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా మీద చాలా నమ్మకం ఉంది. ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో టాక్సిక్ మంచి షేర్ సాధించగలదని అంచనాలు ఉన్నాయి. కొన్ని ట్రేడ్ లెక్కల ప్రకారం ధురంధర్ 2.. టాక్సిక్ మధ్య 60:40 లేదా 50:50 షేర్ కూడా ఉండొచ్చని చెబుతున్నారు. టాక్సిక్ ఎక్కువగా సింగిల్ స్క్రీన్స్, ప్రీమియం మల్టీప్లెక్స్‌లపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

యశ్‌కు దక్షిణ భారతంలో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కన్నడలో అయితే టాక్సిక్‌కు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అని భావిస్తున్నారు. కర్ణాటక ఈ సినిమాకు పెద్ద ఆదాయాన్ని తీసుకురానుంది. అలాగే తమిళనాడు, తెలంగాణ, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి మొత్తం కలెక్షన్లను బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంది.

Advertisement

ఇదిలా ఉండగా..రణవీర్ సింగ్ యాక్షన్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నా, యశ్ బాక్సాఫీస్ స్టామినాను తగ్గించడం అంత సులువు కాదని విశ్లేషకులు అంటున్నారు. యశ్ ఫ్యాన్ బేస్ చాలా లాయల్‌గా ఉంటుంది.

మొత్తం పైన మార్చి 19న ఈ రెండు సినిమాల మధ్య హై వోల్టేజ్ బాక్సాఫీస్ పోరు ఖాయంగా కనిపిస్తోంది. టాక్సిక్ ధురంధర్ పార్ట్ 2కి గట్టి పోటీ ఇస్తుందా? యశ్ ఈ క్లాష్‌లో ఆధిపత్యం చూపిస్తాడా? అన్నది సినిమా విడుదలైన తర్వాతే స్పష్టమవుతుంది.

ALSO READ: Lokesh Kanagaraj: ఖైదీ 2 వివాదంపై నోరు విప్పిన లోకేష్ కనగరాజ్.. అల్లు అర్జున్ సినిమాపై కూడా క్లారిటీ..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×