E-Paper
Advertisement

‘వరల్డ్ వార్ z’ సీక్వెల్ వచ్చేస్తుంది.. 13 ఏళ్ల తర్వాత నిర్మాతలు కీలక నిర్ణయం, బ్రాడ్ పిట్ ఉంటాడా?

‘వరల్డ్ వార్ z’ సీక్వెల్ వచ్చేస్తుంది.. 13 ఏళ్ల తర్వాత నిర్మాతలు కీలక నిర్ణయం, బ్రాడ్ పిట్ ఉంటాడా?
Advertisement

World War Z:ఎన్ని జానర్ల సినిమాలు వచ్చినా జోంబీ సినిమాల క్రేజ్ మాత్రం వేరే లెవల్‌లో ఉంటుంది. ముఖ్యంగా ‘వరల్డ్ వార్ Z’సినిమా 2013లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో చెప్పక్కర్లేదు. మార్క్ ఫోర్స్టర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు సరిగ్గా 13 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్‌కు సీక్వెల్ రాబోతుందన్న వార్త సినీప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. మొదటి సినిమాను నిర్మించిన పారామౌంట్ పిక్చర్స్ మళ్లీ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించడానికి రెడీ అయిందన్న టాక్ వినిపిస్తోంది.

వరల్డ్ వార్ Z’ సినిమా తీసేటప్పుడే ఎన్నో అడ్డంకులు

Advertisement

నిజానికి వరల్డ్ వార్ Z’ సినిమా తీసేటప్పుడే ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఒకపక్క రీ-షూట్లు చేయడం, మరోపక్క బడ్జెట్ భారీగా పెరగడం, షూటింగ్ జరుగుతుండగానే స్క్రిప్ట్ మార్చడం వంటి సమస్యలు వచ్చాయి. ఆ సమయంలో ఈ సినిమా అసలు రిలీజ్ అవుతుందా అన్న అనుమానాలూ వచ్చాయి.కానీ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 540 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో వెంటనే సీక్వెల్ తీసే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఎన్నో కారణాల వల్ల ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఒక దశలో ఈ సినిమాకు డైరెక్షన్ చేయాల్సిన అవకాశం వచ్చినా డేవిడ్ ఫించర్ లాంటి దిగ్గజ దర్శకుడు కూడా తప్పుకున్నాడంటే పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నాయో అర్థమవుతుంది.

also read:బాబోయ్.. ఈ రేంజ్ రక్తపాతమా? రవిబాబు‘రేజర్’ ట్రైలర్ చూస్తే మతిపోవాల్సిందే!

Advertisement

‘వరల్డ్ వార్ Z’ వీడియో గేమ్‌కు వచ్చిన క్రేజ్ క్యాష్ చేసుకోవడానికే

ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత మరోసారి పారామౌంట్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌ను రీస్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే… మొదటి పార్ట్‌లో హీరోగా కనిపించిన బ్రాడ్ పిట్ మళ్లీ ఈ సీక్వెల్‌లో ఉంటాడా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌గా ఉంది. నిజానికి బ్రాడ్ పిట్ లేకుండా వరల్డ్ వార్ Z’ ఫ్రాంచైజీని ఊహించుకోవడం కూడా చాలా మందికి కష్టం. అయినా స్టూడియో మాత్రం ఈ బ్రాండ్ విలువను క్యాష్ చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.
అయితే ఈ 13 ఏళ్లలో హాలీవుడ్‌లో జోంబీ సినిమాల ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు జోంబీలు అంటే కేవలం భయపెట్టే హారర్ సినిమాలే ఉండేవి. ఇప్పుడు మాత్రం హర్రర్‌తో పాటు ఎమోషనల్, పొలిటికల్ థ్రిల్లర్ అంశాలను కలిపి కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు వస్తున్నాయి. ఇక ఇండస్ట్రీలో వినిపిస్తున్న మరో టాక్ ఏమిటంటే… స్టూడియో కేవలం సినిమా క్రేజ్ వల్ల మాత్రమే కాదు, ఇటీవలి కాలంలో పాపులర్ అయిన వరల్డ్ వార్ Z’ వీడియో గేమ్‌కు వచ్చిన క్రేజ్ క్యాష్ చేసుకోవడానికే ఈ సీక్వెల్ ప్లాన్ చేస్తోందట.

బ్రాడ్ పిట్ లాంటి గ్లోబల్ స్టార్ లేకపోతే

అయితే ఇండస్ట్రీ వర్గాల్లో కొంత నెగటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. 13 ఏళ్ల తర్వాత అదే కథను మళ్లీ తీసుకురావడం పెద్ద రిస్క్ అని అంటున్నారు. అప్పట్లో ఉన్న క్రేజ్ ఇప్పుడు ఉంటుందా? ముఖ్యంగా బ్రాడ్ పిట్ లాంటి గ్లోబల్ స్టార్ లేకపోతే సినిమాకు కనీసం ఓపెనింగ్స్ అయినా వస్తాయా? అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు.
కానీ ఈ కామెంట్లన్నిటినీ పక్కనపెట్టి పారామౌంట్ పిక్చర్స్ మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఒక బ్లాక్‌బస్టర్ సినిమాకు ఇంతకాలం తర్వాత సీక్వెల్ చేయడం రిస్క్ అయినా, ఆ రిస్క్‌లో ఉన్న థ్రిల్‌ను ఆస్వాదించేందుకు స్టూడియో సిద్ధమైందన్న మాట.

స్టూడియో ఆశలు నెరవేరుతాయా

మరి ఈ సీక్వెల్‌కు దర్శకత్వం ఎవరు వహిస్తారు? బ్రాడ్ పిట్ మళ్లీ కనిపిస్తాడా? లేక కొత్త హీరోతో వస్తారా? అన్నది ఇప్పటికి క్లారిటీ లేదు. అయితే ఒక విషయం మాత్రం ఖాయం — ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా తీసుకోకపోతే ‘వరల్డ్ వార్ Z’’ బ్రాండ్‌కు మచ్చ పడే అవకాశం కూడా ఉంది.ఇక నిజంగా ఈ సీక్వెల్ ఎప్పుడు వస్తుంది, స్టూడియో ఆశలు నెరవేరుతాయా లేదా అన్నది చూడాలి.

also read:OTT సంచలనం.. సెన్సార్‌ లేని శృంగార కావ్యం.. ఒక్క సిరీస్‌తోనే దేశం మొత్తం ఫిదా!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×