E-Paper
Advertisement

శ్రీవారి సన్నిధిలో మరో వివాదం.. పెద్ది పోస్టర్ తో మహిళా హల్ చల్!

శ్రీవారి సన్నిధిలో మరో వివాదం.. పెద్ది పోస్టర్ తో మహిళా హల్ చల్!
Advertisement

Peddi Movie:తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని నిబంధనలు ప్రత్యేకించి ఉన్నప్పటికీ కూడా.. వాటిని కొంతమంది ఉల్లంఘిస్తూ తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఒక మహిళ ఏకంగా రామ్ చరణ్ పెద్ది సినిమా పోస్టర్ తో తిరుమల కాలినడక మార్గంలో హల్చల్ చేసి వివాదంలో ఇరుక్కుంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

పెద్ది పోస్టర్ తో మహిళ తిరుమలలో హాల్ చల్..

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో.. రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా సక్సెస్ అయితే కాలినడకన వస్తానని మొక్కుకుందో ఏమో తెలియదు కానీ.. ఆ మహిళ మాత్రం పెద్ది పోస్టర్ ను పట్టుకొని నడక మార్గంలో హల్చల్ చేసింది. నిషేధం ఉన్నప్పటికీ కూడా.. సినిమా పోస్టర్ తో సదరు మహిళ పాదయాత్ర చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ , సినీ ప్రచారాలకు తిరుమల సన్నిధిలో ఎటువంటి అనుమతి లేదు అన్న విషయం తెలియదా? అంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ కూడా నడక మార్గంలో సినిమా పోస్టర్ తో మహిళ ప్రత్యక్షమవడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

ALSO READ:ధురంధర్ నటి ఆయేషా ఖాన్ అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

పోస్టర్ లో ఏముందంటే?

ఇకపోతే ఆ మహిళ పట్టుకున్న పోస్టర్ విషయానికి వస్తే.. “పెద్ది సినిమా ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా తిరుమలకు కాలినడకన.. ధన్యవాదాలు” అంటూ ఆ పోస్టర్లో ఉంది. మొత్తానికైతే పెద్ది సినిమా మంచి విజయం అందుకోవడం వల్లే ఆ మహిళ ఇలా పోస్టర్ పట్టుకొని కాలినడకన వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం వివాదంగా మారిన ఈ పోస్టర్ పై, పోస్టర్ పట్టుకొని తిరుగుతున్న సదరు మహిళపై టీటీడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

రామ్ చరణ్ సినిమాలు..

Advertisement

పెద్ది సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ఇది. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం.. జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. జగపతిబాబు, వీజీ చంద్రశేఖర్, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి.. ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించగా.. మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఇక సుమారుగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ చిత్రం తర్వాత ఆయన ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో RC 17 వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×