E-Paper
Advertisement

Swayambhu Movie: నిఖిల్ ‘స్వయంభూ’కు తప్పని తిప్పలు.. విడుదల కష్టమేనా..?

Swayambhu Movie: నిఖిల్ ‘స్వయంభూ’కు తప్పని తిప్పలు.. విడుదల కష్టమేనా..?
Advertisement

Swayambhu Movie: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు.. ఆ మూవీ తర్వాత ఆయన బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ బిజీగా అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ కథలు విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకొని ప్రస్తుతం డిఫరెంట్ స్టోరీ తో స్వయంభు చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ మూవీ టీజర్ ఇటీవలే రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా గత కొద్ది రోజులుగా వాయిదా పడుతూనే వస్తుంది. ఇప్పుడు టీజర్ రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమాకు మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.. అందుకు కారణం కూడా లేకపోలేదు. అయితే నిఖిల్ సినిమా మళ్లీ వాయిదా పడుతుందా? లేదా? అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

‘స్వయంభు’ మళ్ళీ వాయిదా..?

హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న చిత్రం ‘స్వయంభు’.. ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని చిత్రబృందం గతంలోనే ప్రకటించింది.. కానీ ఇప్పుడు ఆ డేట్ న సినిమా రాదనీ తెలుస్తుంది. అందుకు కారణం అడవి శేషు నటించిన డెకాయిట్ మూవీనే.. ఏషియన్ సునీల్ రెండు సినిమాలు చేస్తున్నారు.. రెండు ఒకేసారి తీసుకొచ్చే కలెక్షన్స్ పై ప్రభావం చూపుతుందని నిఖిల్ స్వయంభు ఒకవారం ముందుకు, లేదా వెనక్కి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ విడుదల తేదీ పై ఒక క్లారిటీ రానుందని సమాచారం..

Advertisement

Also Read : ‘వారసురాలు’ సౌదామిని రెమ్యూనరేషన్ ఒక్కరోజుకు ఎంతంటే..?

విజువల్ ఫీస్ట్ గా టీజర్..

నిఖిల్ ఒక యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. సునీల్, సుబ్బరాజ్, సత్య కీలక పాత్రలో నటిస్తుండగా.. నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఈ టీజర్ లో సదాశివుడే దిగి వచ్చి శ్రీరాముడికి అందించిన సింధూరికి కూడా అరణ్యవాసమా’ అంటూ అయ్యప్ప శర్మ పాత్రతో చెప్పించిన డైలాగ్ తో టీజర్ డైలాగ్ లుతో అందరిని బాగా ఆకట్టుకుంది.. డైలాగ్ లు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అలాగే విజువల్ వండర్ గా ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుపోతుందని టీజర్ ని చూస్తే అర్థమవుతుంది.. నిఖిల్ పై రూ.50 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు చేయొచ్చు అనే నమ్మకం నిర్మాతలకి కలిగేలా చేసింది.. నిఖిల్ ఈ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ మూవీ ఎలాంటి రికార్డు లను బ్రేక్ చేస్తుందో చూడాలి.. ఈ మూవీ హిట్ అయితే మాత్రం నిఖిల్ సక్సెస్ ట్రాక్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది.. దీని తర్వాత కార్తికేయ 3 సినిమాలో నిఖిల్ నటించబోతున్నట్లు తెలుస్తుంది..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×