E-Paper
Advertisement

Yash Toxic: వివాదాల నడుమ టాక్సిక్ రీషూట్స్..యష్ ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడు..?

Yash Toxic:  వివాదాల నడుమ టాక్సిక్ రీషూట్స్..యష్ ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడు..?
Advertisement

Yash Toxic: ప్రపంచం మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేయగలిగే సత్తా ఉన్న సినిమా అంటూ టాక్సిక్ సినిమా ప్రచారం పొందుతోంది. ఈ సినిమా టీజర్ విడుదలైన క్షణం నుంచే వ్యూస్ పరంగా రికార్డులు తిరగరాస్తోంది. కానీ అదే సమయంలో వివాదాలు కూడా గట్టిగానే మొదలయ్యాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్.. పేరుతో సినిమాలో కొన్ని సన్నివేశాలు అతిగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వివాదాలు మరింత ఆసక్తికరంగా మారడానికి కారణం..ఇవి ఎక్కువగా యష్ సొంత ఇండస్ట్రీ అయిన కర్ణాటక నుంచే రావడం.

అనుకోకుండా విపరీతమైన ఇమేజ్ ఒక హీరోకి.. వచ్చినప్పుడు అది సమస్యగా మారుతుందని సినీ వర్గాలు అంటున్నాయి. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే ఆలోచనలోనే ఆ హీరోకి కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి అనేది బాగా వాదన. దీనికి ఉదాహరణగా యాష్ కెరీర్‌ని చూపిస్తున్నారు అభిమానులు. KGF Chapter 2.. విడుదలై మూడు సంవత్సరాలు గడిచినా.. ఇప్పటివరకు మరో సినిమా థియేటర్లలోకి రాలేదు. ప్రస్తుతం ఆయన పూర్తి ఫోకస్ అంతా టాక్సిక్‌పైనే ఉంది.

Advertisement

ఈ సినిమాను మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో టాక్సిక్ విషయంలో ఎక్కువ రీషూట్స్ జరుగుతున్నాయనే వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి. అవుట్‌పుట్ విషయంలో యష్ పూర్తిగా సంతృప్తిగా లేరని..అందుకే చాలా సీన్స్ మళ్లీ షూట్ చేయాలని దర్శకురాలికి సూచించారని ప్రచారం జరిగింది. కేజీఎఫ్ తర్వాత వచ్చే సినిమా కావడంతో యష్ ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

మేకర్స్ ప్రకటించిన ప్రకారం టాక్సిక్ సినిమా 2026 మార్చి 19న విడుదల కావడం ఖాయం. మరి ఇలాంటి షూట్ చేస్తూ వెళ్తే ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతుందా అని కొంతమందితో సందేహం ఉంది. ఇప్పటికే యష్ లుక్‌తో పాటు కియారా అద్వానీ, హుమ ఖురేషి లుక్స్ బయటకు వచ్చాయి. తాజాగా నయనతార.. లుక్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. టాక్సిక్ ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోంది.

Advertisement

ఇదే కాకుండా యష్ మరో భారీ ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో రావణుడిగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా యష్ బాధ్యతలు చేపట్టారు. ఇలా టాక్సిక్ చుట్టూ వివాదాలు ఉన్నప్పటికీ.. సినిమాపై అంచనాలు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.

ALSO READ: The Raja Saab: 500కోట్ల రాజా షాబ్ కన్నా 2కోట్ల సినిమా మేలు.. ఇంత తప్పు ఎలా చేశారు..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×